న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ఛాలెంజ్ ‘సూపర్‌’ నోవాస్‌దే: వెలాసిటీపై అద్భుత విజయం

Supernovas clinch Womens T20 Challenge title after beating Velocity

హైదరాబాద్: మహిళల ఐపీఎల్‌కు సన్నాహకంగా జరిగిన 'మహిళల టి20 చాలెంజ్‌' ట్రోఫీని సూపర్‌ నోవాస్‌ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన నాలుగు వికెట్లతో మిథాలీ రాజ్‌ నాయకత్వంలోని వెలాసిటీపై విజయం సాధించి కప్పు ఎగరేసుకుపోయింది. వెలాసిటీ విజయానికి 7 పరుగులు అవసరమైన దశలో తొలి బంతికి పరుగు రాలేదు. అప్పటి వరకూ దూకుడుగా ఆడిన హర్మన్‌ప్రీత్‌ కౌర్ రెండో బంతికి ఔటైంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

దీంతో వెలాసిటీ విజయ సమీకరణం 4 బంతుల్లో 7 పరుగులుగా మారింది. ఆ తర్వాతి మూడు బంతులకు రెండేసి పరుగుల చొప్పున చేసిన రాధా యాదవ్‌.. ఆఖరి బంతికి ఫోర్‌ బాది జట్టుకు విజయాన్నందించింది. అంతకముందు వెలాసిటీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు చేసింది. విజేత సూపర్‌ నోవాస్‌ జట్టుకు రూ. 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించింది.

ఆరో వికెట్‌కు 71 పరుగులు

ఆరో వికెట్‌కు 71 పరుగులు

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసిన వెలాసిటీకి శుభారంభం దక్కలేదు. హేలీ మాథ్యూస్‌ (0), డానియెల్లి వ్యాట్‌ (0) డకౌటయ్యారు. షఫాలీ వర్మ (11), వేద (8), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (12) స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో 37 పరుగులకే సగం (5) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సుష్మ వర్మ, అమెలియా కెర్‌ 38 బంతుల్లో 36(4 ఫోర్లు) ఆరో వికెట్‌కు 71 పరుగులు జోడించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులే చేసింది.

టాప్‌ స్కోరర్‌‌గా సుష్మావర్మ

టాప్‌ స్కోరర్‌‌గా సుష్మావర్మ

సుష్మావర్మ 32 బంతుల్లో 40 (3 పోర్లు, సిక్స్) టాప్‌ స్కోరర్‌‌గా నిలిచింది. అనంతరం 122 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ నోవాస్ జట్టు ఓపెనర్ జయాంగని (2) రెండో ఓవర్లోనే ఔటైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌ (22), ప్రియ పునియా (29)తో కలిసి స్కోరు పెంచింది. వీళ్లిద్దరూ కుదురుకోవడంతో సూపర్‌నోవాస్‌ 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది.

64 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో

64 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో

అయితే, స్వల్పవ్యవధిలో ప్రియా, స్కీవర్‌ (2), సోఫీ (3) ఔట్‌ కావడంతో 64 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో హర్మన్‌ప్రీత్‌ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. 24 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన స్థితిలో అమేలియా బౌలింగ్‌లో బౌండరీ బాదిన కౌర్‌, ఆ తర్వాత దేవిక బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు బాది లక్ష్యాన్ని తక్కువ చేసింది.

ఆఖరి బంతికి ఫోర్‌ బాది జట్టుకు విజయం

ఆఖరి బంతికి ఫోర్‌ బాది జట్టుకు విజయం

చివరి ఓవర్లో 7 పరుగులు అవసరమైన దశలో తొలి బంతికి పరుగు రాలేదు. అప్పటి వరకూ దూకుడుగా ఆడిన హర్మన్‌ప్రీత్‌ కౌర్ రెండో బంతికి ఔటైంది. దీంతో వెలాసిటీ విజయ సమీకరణం 4 బంతుల్లో 7 పరుగులుగా మారింది. ఆ తర్వాతి మూడు బంతులకు రెండేసి పరుగుల చొప్పున చేసిన రాధా యాదవ్‌.. ఆఖరి బంతికి ఫోర్‌ బాది జట్టుకు విజయాన్నందించింది.

Story first published: Sunday, May 12, 2019, 9:45 [IST]
Other articles published on May 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X