న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Super Friday: ఒకే గేమ్... ఒకేరోజు... భారత్-కివీస్ మధ్య మూడు మ్యాచ్‌లు

Super Friday: India to play New Zealand in 3 cricket matches across the globe

హైదరాబాద్: రెండు దేశాలు... ఒకే గేమ్... కానీ ఒకే రోజు మూడు వేర్వేరు అంతర్జాతీయ మ్యాచ్‌లు. ఆ రెండు దేశాలు ఏంటో ఇప్పటికే మీకు అర్ధమయ్యే ఉంటాయి. భారత్-న్యూజిలాండ్. ఈ రెండు దేశాలు శుక్రవారం మూడు క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడుతుండటం విశేషం.

విరాట్ కోహ్లీ సారథ్యంలోని మెన్ ఇన్ బ్లూ, ఇండియా ఎ, భారత అండర్-19 జట్టు. ఈ మూడు జట్లు న్యూజిలాండ్‌తో మూడు వేర్వేరు వేదికలలో రెండు ఖండాల్లో "సూపర్ ఫ్రైడే" రోజున తలపడుతున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు భారత క్రికెట్ అభిమానులకు నాన్-స్టాప్ క్రికెట్‌ను అందించనున్నాయి.

'కివీస్‌ను భారత్‌ చిత్తుగా ఓడిస్తుంది.. మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా''కివీస్‌ను భారత్‌ చిత్తుగా ఓడిస్తుంది.. మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'

ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్ సీనియర్ జట్టుతో కోహ్లీసేన, క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్-ఎతో, దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ యువ జట్టుతో భారత యువ జట్టు తలపడనుంది. ఒకే రోజు ఒకే దేశంతో మూడు మ్యాచుల్లో భారత్‌ తలపడటం ఇదే తొలిసారి.

ఆరు వారాల సుదీర్ఘ పర్యటనలో

ఆరు వారాల సుదీర్ఘ పర్యటనలో

ఆరు వారాల సుదీర్ఘ పర్యటనలో భాగంగా కోహ్లీసేన న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. ఐదు టీ20ల సిరిస్‌లో భాగంగా న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య తొలి టీ20 శుక్రవారం శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైంది.

టాస్ గెలిచిన టీమిండియా

టాస్ గెలిచిన టీమిండియా

ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మరోవైపు భారత యువ జట్టు అండర్‌ 19 ప్రపంచకప్‌లో భాగంగా మధ్యాహ్నం 1.30 నుంచి న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మెగా టోర్నీలో భారత యువ జట్టు ఇప్పటికే శ్రీలంక, జపాన్‌‌పై విజయం సాధించింది.

న్యూజిలాండ్‌-ఎ జట్టుతో భారత్‌-ఎ జట్టు

న్యూజిలాండ్‌-ఎ జట్టుతో భారత్‌-ఎ జట్టు

దీంతో పాటు న్యూజిలాండ్‌-ఎ జట్టుతో భారత్‌-ఎ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్ శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటలకే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. జార్జ్‌ (135) సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో ఇషాన్‌ మూడు, సిరాజ్‌ రెండు వికెట్లు తీశారు.

ఒకేరోజు మూడు మ్యాచ్‌లు

ఒకేరోజు మూడు మ్యాచ్‌లు

* New Zealand vs India, 1st T20I: From 12:20 PM IST in Auckland

* New Zealand A vs India A, 2nd unofficial ODI: From 03:30 AM IST in Christchurch

* U19 World Cup, India vs New Zealand: From 01:30 PM IST in Bloemfontein

Story first published: Friday, January 24, 2020, 12:38 [IST]
Other articles published on Jan 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X