న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒంటరైన కేన్ మామ: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కోచ్ కూడా గుడ్‌బై: కొత్త ఫ్రాంఛైజీ వైపు చూపు

Sunrisers Hyderabad retention: Coach Trevor Bayliss steps down, likely to sign with Lucknow franchise

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022..15వ ఎడిషన్ సరికొత్తగా కనిపించబోతోంది. అన్ని ఫ్రాంఛైజీల్లోనూ పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఫ్రాంఛైజీలన్నీ కూడా తమ తురుఫుముక్కలను వదలుకున్నాయి. వచ్చే సంవత్సరం మార్చి చివరివారంలో మొదలయ్యే ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్రతి జట్టులోనూ కొత్త ముఖాలు కనిపించబోతున్నాయి. రెండు కొత్త ఫ్రాంఛైజీలు వచ్చి చేరడంతో మార్పులు అనివార్యమైంది. చివరికి హెడ్ కోచ్‌ల పరిస్థితి కూడా ఇంతే.

కొత్త ఫ్రాంఛైజీల రాకతో..

కొత్త ఫ్రాంఛైజీల రాకతో..

కొత్తగా రెండు ఫ్రాంఛైజీలు చేరడం వల్ల రిటెన్షన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ ఆఫ్ కంపెనీ, సీవీసీ కేపిటల్స్ సంస్థలు లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలన నెలకొల్పాయి. ఫలితంగా ఐపీఎల్ 2022లో ఆడే జట్ల సంఖ్య 10కి పెరిగింది. ఈ రెండు జట్లు కొత్తగా టీమ్‌ను రూపొందించుకోవాల్సి ఉంది. హెడ్ కోచ్ మొదలుకని, ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ వరకూ కొత్తవారిని తీసుకోవాల్సి ఉంది. ఫలితంగా- రిటెన్షన్ పాలసీని అమలు చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.

ఏప్రిల్ 2న తొలి మ్యాచ్

ఏప్రిల్ 2న తొలి మ్యాచ్

ఐపీఎల్ 2022 సీజన్.. 15వ ఎడిషన్ ఏప్రిల్ 2వ తేదీన ఆరంభం అవుతుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఏప్రిల్, మే నెలల పొడవునా ఐపీఎల్ మ్యాచ్‌లు కొనసాగుతాయి. జూన్ మొదటివారంలో ఫైనల్ నిర్వహించే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్ జూన్ మొదటి వారమా? లేక రెండో వారం దాకా పొడిగించాలా? అనేది బీసీసీఐ నిర్ణయించాల్సి ఉంది. ప్రతి జట్టు కూడా 14 మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్లేఆఫ్స్, ఫైనల్స్ ఉంటాయి.

రిటెన్షన్ పాలసీతో సన్‌రైజర్స్ ఎవరు మిగిలారంటే..

రిటెన్షన్ పాలసీతో సన్‌రైజర్స్ ఎవరు మిగిలారంటే..

రిటెన్షన్ పాలసీ వల్ల సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో మిగిలింది ముగ్గురే. కేప్టెన్ కేన్ విలియమ్సన్, ఉమ్రాన్ మలిక్, అబ్దుల్ సమద్ మాత్రమే మిగిలారు. కేన్ విలియమ్సన్-14 కోట్లు, ఉమ్రాన్ మలిక్-4 కోట్లు, అబ్దుల్ సమద్- 4 కోట్ల రూపాయలకు రిటెయిన్ చేసుకుంది. ప్రస్తుతం ఈ టీమ్‌లో ఈ ముగ్గురే మిగిలారు. హెడ్ కోచ్ ట్రెవర్ బెలిస్ కూడా గుడ్‌బై చెప్పాడు. లక్నో ఫ్రాంఛైజీతో ట్రెవర్.. తన కాంట్రాక్ట్ కుదుర్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్రెవర్ హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడే ఇంగ్లాండ్ జట్టు 2019 ఐసీసీ ప్రపంచకప్‌ను గెలిచింది.

కొత్త కోచ్ కోసం..

కొత్త కోచ్ కోసం..

ట్రెవర్ రాజీనామా చేయనున్న నేపథ్యంలో- సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ కొత్త హెడ్ కోచ్ అన్వేషణలో పడింది. ఇప్పటికే మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా జట్టును వీడాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్ అపాయింట్ కావడంతో ఈ పదవిని వదులు కోవాల్సి వచ్చింది. కోచ్, మెంటార్ సహా జట్టు మొత్తాన్నీ సెలెక్ట్ చేసుకోవడంపై సన్‌రైజర్స్ దృష్టి పెట్టింది. ఇతర ఫ్రాంఛైజీలకు చెందిన కోచ్‌ను తీసుకుంటుందా? లేక కొత్త వారిని ఇంక్లూడ్ చేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Story first published: Thursday, December 2, 2021, 10:56 [IST]
Other articles published on Dec 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X