న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్లేఆఫ్ కు ప్రత్యేకంగా తయారవుతాం: విలియమ్‌సన్

Sunrisers Hyderabad pay for over-dependence on Kane Williamson as KKR enter playoffs

హైదరాబాద్: విజయాల పట్టికలో అగ్రభాగాన వున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్‌కి చేరుకున్న తొలి జట్టుగానూ నిలిచింది. గురువారం మే 10న ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై 9 వికెట్ల తేడాతో గెలిచిన సన్‌రైజర్స్ జట్టు ప్లే ఆఫ్‌లో అధికారికంగా బెర్తు ఖాయం చేసుకుంది. ఇక లాంచనప్రాయంగా ఆడిన మ్యాచ్‌లలో లీగ్ దశ ముగిసేసరికి వరుస 3వైఫల్యాలతో ముగించింది.

ఈ నేపథ్యంలో మరోసారి బరిలోకి దిగేముందు పక్కా ప్రణాళికతో ప్లేఆఫ్స్‌లో బరిలో దిగుతామని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. గెలుపు బాట పట్టడానికి కొన్ని మార్పులు తప్పవని సంకేతాలిచ్చాడు. శనివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తమకంటే మెరుగ్గా ఆడిందని తెలిపాడు. లీగ్‌ దశలో సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా మూడో ఓటమి.

'కోల్‌కతాతో మ్యాచ్‌లో 200 పరుగులు సాధించాలని అనుకున్నాం. ఐతే మా నుంచి కొన్ని పొరపాట్లు జరిగాయి. కోల్‌కతా అద్భుతంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ను తమ వైపుకు తిప్పుకుంది. మరో మంచి భాగస్వామ్యం నమోదు చేసుంటే ఫలితం మరోలా ఉండేది. సన్‌రైజర్స్‌ ఆటగాళ్ళు బాగానే ఆడారు. కానీ, కోల్‌కతా మాకంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఇప్పుడిక ప్లేఆఫ్స్‌ సమయం. మా బలాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తాం. ప్లేఆఫ్స్‌లో పక్కా ప్రణాళికతో బరిలో దిగుతాం. గెలుపు బాట పట్టడానికి కొన్ని మార్పులు తప్పనిసరి' అని విలియమ్సన్‌ చెప్పాడు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే టాప్ 4 జాబితాలో ఉన్న నాలుగు జట్లు ప్లే‌ఆఫ్ సమరంలో తలపడనున్నాయి. చెన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ మంగళవారం జరగనుండగా రాజస్థాన్ వర్సెస్ కోల్‌కతా బుధవారం జరగనుంది. ఆ తర్వాత ఈ మ్యాచ్‌లో విజేతలు ఫైనల్ సమరంలో ఆదివారం మే 27 ముంబై వేదికగా తలపడనున్నారు.

Story first published: Monday, May 21, 2018, 8:46 [IST]
Other articles published on May 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X