టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. మూడు మార్పులతో కోల్‌కతా

ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన సన్‌రైజర్స్‌ కెప్టెన్ కేన్ విలియంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్‌ జట్టు ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు కోల్‌కతా మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.

పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని భావిస్తుండగా.. మరోవైపు కోల్‌కతా వరుస ఓటముల నుంచి బయటపడాలని చూస్తోంది. ఇరు జట్లు 8 పాయింట్లతో సమానంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ఇద్దరికీ చాలా కీలకం. దీంతో ఈ పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

జట్లు:

కోల్‌కతా నైట్‌రైడర్స్:

క్రిస్‌ లిన్, సునీల్ నరైన్, శుభమన్ గిల్, నితీశ్ రాణా, రింకు సింగ్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్, కెప్టెన్), ఆండ్రీ రసెల్, పీయూస్ చావ్లా, కరియప్ప, హరీ గుర్నే, యర్ర పృద్వి రాజ్.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:

డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), కేన్ విలియంసన్ ( కెప్టెన్), విజయ్‌ శంకర్‌, దీపక్‌ హుడా, యూసుఫ్ పఠాన్, రషీద్ ఖాన్, షాబాద్ నదీమ్, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, ఖలీల్ అహ్మద్.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, April 21, 2019, 16:06 [IST]
Other articles published on Apr 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X