న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రోహిత్.. కెప్టెన్‌గా బాగా రాణిస్తున్నాడు'

Sunil Gavaskar impressed with Rohit Sharmas captaincy, feels added responsibility only making him better

న్యూఢిల్లీ: ఆసియా కప్‌లో భారత జట్టుకి కెప్టెన్‌గా ఉండటంతో రోహిత్ శర్మ ఇప్పుడు మరింత బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. టోర్నీలో భాగంగా గత మంగళవారం హాంకాంగ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలిచేందుకు కాస్త శ్రమించిన భారత జట్టు.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లలోనూ సునాయాసంగా విజయాలు అందుకుంది.

బుధవారం పాకిస్థాన్‌ను, శుక్రవారం బంగ్లాదేశ్‌ని చిత్తుగా ఓడించి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ముఖ్యంగా.. పాక్, బంగ్లాదేశ్‌పై అర్ధశతకాలు బాది రోహిత్ శర్మ జట్టు విజయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాడు. సూపర్-4లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య రేపు సాయంత్రం మ్యాచ్ జరగనుంది.

'కెప్టెన్‌గా రోహిత్ శర్మకి అవకాశమొచ్చిన ప్రతిసారీ.. అతను నిరూపించుకుంటున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలేనప్పుడు స్వేచ్ఛగా రెచ్చిపోయే ఈ ఓపెనర్.. ఆసియా కప్‌లో సహనంతో ఆడుతూ జట్టుకి విజయాల్ని అందిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే.. కెప్టెన్సీ బాధ్యత అతడిలోని అత్యుత్తమ ఆటని వెలికితీస్తోంది' అని సునీల్ గవాస్కర్ ప్రశంసించాడు.

ఆసియా కప్ కంటే ముందు వన్డేలు, టీ20లు కలిపి మొత్తం 12 మ్యాచ్‌లకి రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించగా.. అందులో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే భారత్ జట్టు ఓడింది. ఇందులో శ్రీలంకతో జరిగిన ఓ వన్డేలో రోహిత్ శర్మ ఏకంగా 208 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Story first published: Sunday, September 23, 2018, 9:51 [IST]
Other articles published on Sep 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X