లంక పర్యటనకు డేల్ స్టెయిన్: పునరాగమనంలో రాణిస్తాడా?

Posted By:
Steyn looking to secure county deal to prove fitness

హైదరాబాద్: కొన్నేళ్ల నుంచి గాయాలతో సతమతమవుతున్న సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్‌స్టెయిన్ పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేందుకు ఆసక్తి ఎదురుచూస్తున్నాడు. అంతకంటే ముందు ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు.

దీనిలో భాగంగానే జూన్‌లో ఇంగ్లీష్ కౌంటీల్లో హాంప్‌షైర్ తరఫున ఆడాలని నిర్ణయించుకున్నాడు. భారత్‌తో తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా స్టెయిన్ గాయపడ్డాడు. దీంతో భారత్‌తో మిగతా సిరీస్‌లతో పాటు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌కూ అతడు దూరమయ్యాడు. సూపర్ స్పోర్ట్ టెలివిజన్‌తో స్టెయిన్ మాట్లాడాడు.

పూర్తి ఫిట్‌నెస్ సాధించానని, స్వదేశంలో భారత్‌తో జరిగిన తొలి టెస్టు సందర్భంగా మడమ గాయంతో సిరీస్‌ నుంచి తప్పుకున్న 34 ఏళ్ల స్టెయిన్‌ పేర్కొన్నాడు. 'ఇప్పుడు 12 నుంచి 15 ఓవర్లు బౌలింగ్‌ చేయగలుగుతున్నా. కానీ టెస్టు మ్యాచ్‌కు ఇది సరిపోదు. అందుకే ఐపీఎల్‌లో పాల్గొనకుండా కౌంటీల్లో హాంప్‌షైర్‌ తరఫున బరిలో దిగాలనుకుంటున్నా. ఆ తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్తా' అని స్టెయిన్‌ అన్నాడు.

ఈ సందర్భంగా ఐపీఎల్ లో పాల్గొనడం లేదనే విషయాన్ని వెల్లడించాడు. టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు అతను మూడు వికెట్లు దూరంలో మాత్రమే ఉన్నాడు. జులై నెలలో అతను వెళ్లబోయే శ్రీలంక పర్యటనే అతని ఫిటెనెస్‌ను నిర్ణయించనుంది. ఇంగ్లాండ్‌లోనే ఆడతానంటోన్న స్టెయిన్ ఎంతవరకు నెగ్గుకురాగలడో చూడాల్సిందే.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 2, 2018, 11:57 [IST]
Other articles published on Apr 2, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి