న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 383.. ప్రస్తుతం 18/2.. స్టోక్స్‌పైనే ఆశలు!!

Steve Smith starred with the bat again, England lose Rory Burns, JOe Root in chase of 383

మాంచెస్టర్‌: యాషెస్ సిరీస్ నాలుగో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. దీంతో ఇంగ్లండ్‌ గడ్డపై యాషెస్ నిలబెట్టుకునే స్థితికి చేరుకుంది. 383 పరుగుల భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ నాలుగో రోజు ముగిసేసరికి 7 ఓవర్లలో 2 వికెట్లకు 18 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు మరో 365 పరుగులు వెనకబడి ఉంది. ఆదివారం ఆటకు చివరి రోజు కావడంతో ఇంగ్లండ్‌ ఏమేరకు పోటీనివ్వగలరనేది ఆసక్తికరంగా మారనుంది. ఇక ఆసీస్ గెలువాలంటే మరో 8 వికెట్లు తీస్తే చాలు.

<strong>సెరెనా కలలకు చెక్.. ఎస్‌ ఓపెన్‌ విజేత బియాంకా ఆండ్రిస్కూ</strong>సెరెనా కలలకు చెక్.. ఎస్‌ ఓపెన్‌ విజేత బియాంకా ఆండ్రిస్కూ

ఆదిలోనే షాక్:

ఆదిలోనే షాక్:

383 పరుగులు రికార్డు ఛేదనకు బరిలోదిగిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇంగ్లండ్‌ను పేసర్ ప్యాట్‌ కమిన్స్‌ బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌ మూడు, నాలుగు బంతులకు బర్న్స్ (0), రూట్‌ (0)లను బలిగొన్నాడు. అత్యద్భుతం అనదగ్గ బంతితో రూట్‌ వికెట్లను అతడు గిరాటేసిన బంతి మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. క్రీజులో డెన్లీ (10), రాయ్‌ (8) లు ఉన్నారు. చేతిలో ఉన్న 8 వికెట్లతో ఇంకా 365 పరుగులు చేయాల్సి ఉంది. కనీసం డ్రా చేసుకోవాలన్నా రోజంతా ఇంగ్లండ్ బ్యాటింగ్ కొనసాగించాల్సి ఉంటుంది.

ఆదుకున్న బట్లర్‌:

ఆదుకున్న బట్లర్‌:

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 200/5తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 301 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్‌ (3/80) ధాటికి స్టోక్స్‌ (26), బెయిర్‌ స్టో (17) త్వరగానే ఔటయ్యారు. ఈ సమయంలో బట్లర్‌ (65 బంతుల్లో 41; 7 ఫోర్లు) పోరాటంతో ఫాలో ఆన్‌ తప్పించాడు. అయితే ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో బట్లర్‌కు లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు సహకారం ఇవ్వలేకపోయారు. హాజెల్‌వుడ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.

అడ్డుగోడలా స్మిత్:

అడ్డుగోడలా స్మిత్:

196 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆస్ట్రేలియా 44 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. వార్నర్ (0) మరోసారి నిరాశ పరిచాడు. హారిస్ (6), లబుషేన్ (11), హెడ్ (12) కూడా త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ స్థితిలో స్టీవ్ స్మిత్‌ (82; 11 ఫోర్లు) మళ్లీ అడ్డుగోడలా నిలిచాడు. సునాయాసంగా బౌండరీలు సాధిస్తూ స్కోరును పెంచుకుంటూ పోయాడు. ఈ క్రమంలో వేడ్‌ (34)తో కలిసి ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అనంతరం స్మిత్, వెడ్ కూడా వెనుదిరగడంతో ఆస్ట్రేలియా 186/6 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆర్చర్‌కు మూడు, బ్రాడ్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Story first published: Sunday, September 8, 2019, 12:12 [IST]
Other articles published on Sep 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X