న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాకౌట్ పంచ్: కోహ్లీ కన్నా స్టీవ్ స్మిత్‌దే మెరుగైన రికార్డు

Steve Smith miles ahead of Kohli when it comes to knock-out punches

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఇండియా నుంచి విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా నుంచి స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్, ఇంగ్లాండ్ నుంచి జో రూట్ ఈ నలుగురు క్రికెటర్లు అభిమానులచే మన్ననలను అందుకుంటున్నారు. అయితే, నాకౌట్ గేమ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే స్టీవ్ స్మితే మెరుగని మరోసారి నిరూపించుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ల పునరాగమనం ఎంతో ఘనంగా జరిగింది. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధం ముగిసిన తర్వాత ఈ ఇద్దరూ పాల్గొన్న ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో లీగ్ దశలో డేవిడ్ వార్నర్ ఆసీస్ విజయాల్లో కీలకపాత్ర పోషించగా... ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీపైనల్లో స్టీవ్ స్మిత్ చేసిన ఒంటరి పోరాటం నిజంగా అద్భుతం.

ఇంగ్లాండ్ బౌలర్లు తనను ఎగతాళి చేస్తోన్న

ఇంగ్లాండ్ బౌలర్లు తనను ఎగతాళి చేస్తోన్న

ఇంగ్లాండ్ బౌలర్లు తనను ఎగతాళి చేస్తోన్న ఏమాత్రం పట్టించుకోకుండా చివరి వరకు క్రీజులో ఒంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ 119 బంతుల్లో 85 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా... స్టీవ్ స్మిత్ మాత్రం మొక్కవోని దీక్షతో చివరి వరకు తన శాయశక్తులా పోరాడటంతో ఆస్ట్రేలియా ఆ మాత్రం స్కోరన్నా చేయగలిగింది. నాకౌట్ గేముల్లో స్టీవ్ స్మిత్ ఎప్పుడూ మంచి ప్రదర్శనే చేశాడు.

ఐసీసీ నాకౌట్ గేముల్లో

ఐసీసీ నాకౌట్ గేముల్లో

ఇప్పటివరకు ఐసీసీ నాకౌట్ గేముల్లో స్టీవ్ స్మిత్ వరుసగా నాలుగు సార్లు యాభైకి పైగా పరుగులు చేశాడు. 2015 ప్రపంచకప్‌లో సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన సెమీపైనల్ మ్యాచ్‌లో సెంచరీ బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా, గురువారం ఎడ్జిబాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించడంతో ఏడు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని స్టీవ్ స్మిత్ సమం చేశాడు.

విరాట్ కోహ్లీతో పోలిస్తే స్టీవ్ స్మిత్ మెరుగైన రికార్డు

విరాట్ కోహ్లీతో పోలిస్తే స్టీవ్ స్మిత్ మెరుగైన రికార్డు

ఈ క్రమంలో నాకౌట్ గేముల్లో విరాట్ కోహ్లీతో పోలిస్తే స్టీవ్ స్మిత్ మెరుగైన రికార్డుని కలిగి ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు మూడు ప్రపంచకప్ సెమీపైనల్స్ మ్యాచ్‌లు ఆడి కేవలం 11 పరుగులే చేశాడు. 2011 ప్రపంచకప్‌లో పాక్‌పై 9 పరుగులు, 2015లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఒక పరుగుకే పెవిలియన్‌కు చేరగా... 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం కేవలం ఒక్క పరుగుకే ఔటయ్యాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో

ఇక, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌పై కేవలం 5 పరుగులే చేసి ఔటయ్యాడు. దీనిని చూస్తుంటే నాకౌట్ గేమ్స్‌లో కోహ్లీ ఎంతటి చెత్త ప్రదర్శన చేశాడో తెలుస్తుంది. చివరి రెండు సార్లు విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్‌గా ఉండటం విశేషం. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు సైతం ఇలాంటి అపవాదే ఉంది.

టీమిండియాను గెలిపించలేడనే అపవాదు

టీమిండియాను గెలిపించలేడనే అపవాదు

సచిన్ టెండూల్కర్ ఆడే రోజుల్లో పెద్ద మ్యాచ్‌ల్లో టీమిండియాను గెలిపించలేడనే అపవాదుని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ సైతం నాకౌట్ గేముల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడనే అపవాదుని మూటగట్టుకుంటున్నాడు. ఇక, స్మిత్ విషయానికి వస్తే నాకౌట్ గేముల్లో ఎన్నోసార్లు తన అద్భుత ప్రదర్శనతో ఆసీస్‌ను గెలిపించాడు.

Story first published: Friday, July 12, 2019, 12:26 [IST]
Other articles published on Jul 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X