న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Test Rankings: మళ్లీ అగ్రస్థానానికి స్మిత్..నాలుగో ర్యాంకులో కోహ్లీ!యాష్‌ మినహా మరెవ్వరూ లేరు!

Steve Smith becomes the number 1 Test batsman in ICC Test Rankings, Virat Kohli moves to number 4

దుబాయ్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను స్మిత్‌ వెనక్కి నెట్టాడు. ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఒక స్థానం మెరుగుపరుచుకుని నాలుగో ర్యాంకులో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో విఫలమైన ఇంగ్లండ్ సారథి జో రూట్‌ ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు.

ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత బుధవారం ఐసీసీ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. లార్డ్స్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో కివీస్ సారథి కేన్ విలియమ్సన్‌ (886 రేటింగ్‌) కేవలం 13 పరుగులే చేశాడు. గాయంతో రెండో టెస్టు ఆడలేదు. దీంతో కేన్ రేటింగ్‌ పాయింట్లపై ప్రభావం పడింది. 891 రేటింగ్‌తో స్టీవ్‌ స్మిత్‌ తిరిగి నంబర్‌ వన్‌గా నిలిచాడు. విరాట్‌ కోహ్లీ 814 రేటింగ్‌తో కొనసాగుతున్నాడు. పరుగులు చేయకుండా నిరాశ పరిచిన ఇంగ్లీష్ సారథి జో రూట్‌ 797 రేటింగ్‌తో ఐదో స్థానంలో ఉన్నాడు.

WTC Final 2021 ముందు భారీ షాక్.. బ‌యో బ‌బుల్‌ను వీడిన ఆరుగురు న్యూజిలాండ్ ప్లేయర్స్! ఆందోళనలో భారత్!WTC Final 2021 ముందు భారీ షాక్.. బ‌యో బ‌బుల్‌ను వీడిన ఆరుగురు న్యూజిలాండ్ ప్లేయర్స్! ఆందోళనలో భారత్!

భారత ప్లేయర్స్ రిషబ్ పంత్‌ (797), రోహిత్‌ శర్మ (797) ఇద్దరూ ఆరో స్థానంలో నిలిచారు. డబుల్‌ సెంచరీ చేసిన డేవాన్‌ కాన్వే బ్యాటర్ల జాబితాలో సంయుక్తంగా 61వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ప్రతి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన కివీస్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ 307 రేటింగ్‌తో 64వ స్థానంలో నిలిచాడు. స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ కెరీర్‌ బెస్ట్‌ 323 రేటింగ్‌ సాధించాడు. ప్యాట్‌ కమిన్స్‌ (908), రవిచంద్రన్‌ అశ్విన్‌ (850), టిమ్‌ సౌథీ (830) టాప్‌-3 బౌలర్లుగా ఉన్నారు. కాగా టాప్‌-10లో యాష్‌ మినహా భారత్‌ నుంచి మరెవ్వరూ లేరు. ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ 2, రవీంద్ర జడేజా 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 123 రేటింగ్‌ పాయింట్లతో కివీస్ టాప్‌లో ఉంది. 121 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇటీవలి కాలంలో కోహ్లీసేన ఎక్కువగా టెస్ట్ మ్యాచులు ఆడలేదు. జూన్ 18 నుంచి ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ఆడనుంది. ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107), పాకిస్తాన్ (94) టాప్‌-5లో ఉన్నాయి.

Story first published: Wednesday, June 16, 2021, 17:40 [IST]
Other articles published on Jun 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X