న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రాఎఫెక్ట్: ద్రవిడ్‌తో మాట్లాడా... ప్రతీ ఒక్కరూ ఎన్‌సీఏలోనే శిక్షణ తీసుకోవాలి: గంగూలీ

Spoke to Rahul Dravid, players will have to go to NCA for rehabilitation: Sourav Ganguly

హైదరాబాద్: క్రికెటర్లకు సమస్య వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరూ తమ పునరావసంలో జాతీయ క్రికెట్‌ అకాడమీకి (ఎన్‌సీఏ)లోనే శిక్షణ తీసుకోవాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.

"నేను ద్రవిడ్‌ను నిన్న కలిశాను. ఎన్‌సీఏలో మేము ఒక పద్ధతి రూపొందించాం. భారత క్రికెటర్ల ఎవరికైనా చికిత్స-శిక్షణ అవసరమైతే ఎన్‌సీఏకే వెళ్లాలి. ఇక్కడ కారణం ఏదైనా, గాయపడ్డ ఆటగాళ్ల పర్యవేక్షణ బాధ్యత ఎన్‌సీఏదే. అక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఆటగాళ్లు ఇబ్బందికి గురికాకుండా సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాం" అని గంగూలీ అన్నాడు.

ఆశలు అడియాసలు: ట్రయల్స్‌లో మేరీకోమ్‌ చేతిలో నిఖత్ జరీన్ ఓటమిఆశలు అడియాసలు: ట్రయల్స్‌లో మేరీకోమ్‌ చేతిలో నిఖత్ జరీన్ ఓటమి

చికిత్స కోసం శిక్షణ కోసం

చికిత్స కోసం శిక్షణ కోసం

"చికిత్స కోసం శిక్షణ కోసం బయట ఫిజియోలను సంప్రదించడం సరైనది కాదు. కొత్త ప్రదేశంలో ప్రస్తుతం ఎన్‌సీఏలో నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. మేం మరో 18 నెలలు ఉంటే.. అత్యాధునిక వసతులు, టెక్నాలజీ ఉన్న సరికొత్త ఎన్‌సీఏని చూస్తారు" అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇటీవల బుమ్రాకు ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించేందుకు ఎన్‌సీఏ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

వెన్ను గాయం నుంచి కోలుకున్న బుమ్రా

వెన్ను గాయం నుంచి కోలుకున్న బుమ్రా

వెన్ను గాయం నుంచి కోలుకున్న అతను పునరాగమనం చేయాలంటే ఎన్‌సీఏలో ఫిట్‌నెస్‌ టెస్టు పాస్‌ కావాల్సిందే. ఈ టెస్టు రిపోర్టు ఆధారంగానే సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ ఎంపిక ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటుంది. గాయం నుంచి కోలుకునేందుకు బుమ్రా ఎన్‌సీఏను కాదని, తన పునరావాసాన్ని తను చూసుకున్నాడు.

ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించడం కుదరదన్న ద్రవిడ్

ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించడం కుదరదన్న ద్రవిడ్

అయితే, అతనెలా పురోగతి సాధించాడో తెలియకుండా, అతడిని సమీక్షించకుండా ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించడం కుదరదని రాహుల్‌ ద్రవిడ్‌ తేల్చి చెప్పాడు. బుమ్రాకు టెస్టు నిర్వహించడం లేదని టీమిండియా అసిస్టెంట్‌ ట్రెయినర్‌ యోగేశ్‌ పర్మార్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనిపై బీసీసీఐ అధ్యక్ష హోదాలో సౌరవ్‌ గంగూలీ కూడా సీరియస్‌గా దృష్టి సారించడంతో నేరుగా ద్రవిడ్‌నే కలిశాడు.

ద్రవిడ్‌తో దాదా భేటీ

ద్రవిడ్‌తో దాదా భేటీ

దీనిపై గురువారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడిన తర్వాత సౌరవ్ గంగూలీ మరోసారి వివరణ ఇచ్చాడు. అదే సమయంలో నాలుగు దేశాల మధ్య నిర్వహించే 'వన్డే సూపర్ సిరిస్'‌పై మాట్లాడుతూ అది కేవలం ప్రతిపాదన అని చెప్పుకొచ్చాడు.

అది ప్రతిపాదన మాత్రమే

అది ప్రతిపాదన మాత్రమే

"అది ప్రతిపాదన మాత్రమే. మంచి పోటీ ఉండే టోర్నీ రూపొందించాలనే ఉద్దేశంతో దాన్ని ప్రతిపాదించాం. దానికి బ్రాడ్‌కాస్టర్స్‌, ఐసీసీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అది ఎంత వరకు విజయవంతమవుతుందో చూద్దాం. మనం ద్వైపాక్షిక సిరీస్‌లే ఎక్కువగా చూస్తున్నాం. కానీ ప్రజలు మంచి టోర్నీలను ఆశిస్తున్నారు" అని గంగూలీ అన్నాడు.

బాక్సింగ్‌ డే టెస్టుకు ఎంతో మంది

బాక్సింగ్‌ డే టెస్టుకు ఎంతో మంది

"అభిమానుల్లో క్రికెట్ పట్ల ఆసక్తి పెంచడానికే గులాబీ బంతితో డే-నైట్‌ టెస్టులను తీసుకువచ్చాం. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మెల్ బోర్న్‌లో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టుకు ఎంతో మంది ప్రేక్షకులు వస్తున్నారు" అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, మరో దేశంతో కలిపి ప్రతి ఏటా నాలుగు దేశాల టోర్నీ ఆడాలని గంగూలీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, January 2, 2020, 14:31 [IST]
Other articles published on Jan 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X