న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా కెరీర్‌లో చాలా స్పెషల్‌ ఇన్నింగ్స్‌ .. అనుష్కకు వెడ్డింగ్‌ గిఫ్ట్‌ ఇదే!!

Special gift: Virat Kohli dedicates Mumbai T20I victory to Anushka Sharma on 2nd wedding anniversary

ముంబై: బుధవారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన చివరి టీ20లో భారత్‌ 67 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెచ్చిపోయి 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. వాంఖెడే స్టేడియంలో గత మ్యాచ్‌లో (2016, టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌) ఎదురైన పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

మ్యాచ్‌కే హైలైట్‌.. విండీస్‌ ప్లేయర్ ఫీల్డింగ్‌ విన్యాసం (వీడియో)!!మ్యాచ్‌కే హైలైట్‌.. విండీస్‌ ప్లేయర్ ఫీల్డింగ్‌ విన్యాసం (వీడియో)!!

రెండో వెడ్డింగ్‌ యానివర్సరీ:

రెండో వెడ్డింగ్‌ యానివర్సరీ:

విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మ సరిగ్గా ఇదే రోజు (డిసెంబర్‌ 11, 2017లో) ఇటలీలోని టస్కనీలో వివాహం చేసుకున్నారు. బుధవారం విరుష్క జోడి రెండో వెడ్డింగ్‌ యానివర్సరీ. మ్యాచ్ ఉండడంతో విరుష్క జోడి బయటకు వెళ్లందుకు వీలులేకుండా పోయింది. అయితే మైదానంలో ఉన్నా కూడా కోహ్లీ తన భార్య అనుష్కకు అద్భుతమైన బహుమతిని అందించాడు. విండీస్‌పై సాధించిన టీ20 సిరీస్‌ విజయాన్ని అనుష్కకు రెండో వివాహ వార్షికోత్సవం బహుమతిగా ఇచ్చినట్లు కోహ్లీ తెలిపాడు.

అనుష్కకు వెడ్డింగ్‌ గిఫ్ట్‌ ఇదే:

ప్రెజెంటేషన్‌ సమయంలో వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అడిగిన ప్రశ్నకు బదులుగా కోహ్లీ మాట్లాడుతూ... 'నా కెరీర్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లలో ఇదొకటి. చాలా స్పెషల్‌ ఇన్నింగ్స్‌ కూడా. ఓ మంచి ఇన్నింగ్స్ మా రెండో వివాహ వార్షికోత్సవం రోజున రావడం ఎంతో ప్రత్యేకం. ఈ ఇన్నింగ్స్‌ నా భార్య అనుష్కకు నేనిచ్చే వెడ్డింగ్‌ గిఫ్ట్‌' అని అన్నాడు.

ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ:

ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ:

విరాట్ కోహ్లీ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకి ఇది ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ. అయితే ఓవరాల్‌గా భారత్‌ తరఫున ఐదవది. విండీస్‌తో మూడో టీ20లో కోహ్లీ 7 సిక్స్‌లు బాదాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకి ఇది అత్యుత్తమం. ఒకే దేశంలో అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన నాలుగో క్రికెటర్ కోహ్లీ. భారత్‌ తరఫున తొలి క్రికెటర్‌గా నిలిచాడు. మార్టిన్ గప్టిల్‌ (న్యూజిలాండ్‌), మొహమ్మద్‌ షహజాద్‌ (అఫ్గానిస్తాన్‌- యూఏఈలో), కొలిన్‌ మున్రో (న్యూజిలాండ్‌) 1000 పరుగులు చేశారు.

భారత్ ఘన విజయం:

భారత్ ఘన విజయం:

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసి ఓటమిపాలయింది. కెప్టెన్ పొలార్డ్‌ (39 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో దీపక్‌ చాహర్, భువనేశ్వర్, మొహమ్మద్ షమీ, కుల్దీప్‌ యాదవ్ తలా 2 వికెట్లు తీశారు. రాహుల్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌', కోహ్లీకి 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డులు దక్కాయి.

Story first published: Thursday, December 12, 2019, 10:44 [IST]
Other articles published on Dec 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X