న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

300 క్లబ్‌లో మోర్కెల్‌: ఆసక్తికరంగా కేప్‌టౌన్ టెస్టు

By Nageshwara Rao
South Africa Vs Australia, 3rd Test: Lyon and Paine frustrate Proteas after Morkel joins 300 club

హైదరాబాద్: కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్‌ మోర్నీ మోర్కెల్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఐదో సఫారీ బౌలర్‌గా మోర్నీ మోర్కెల్ రికార్డు నెలకొల్పాడు. అంతకముందు దక్షిణాఫ్రికా తరుపున డోనాల్డ్‌ (330), షాన్‌ పొలాక్‌ (421), ఎన్తినీ(390), డేల్‌ స్టెయిన్‌(419)లు ఈ ఘనత సాధించారు.

Australia vs South Africa 2018 3rd Test Score Card

అంతేకాదు 300 వికెట్ల మైలురాయిని అందుకున్న పెద్ద వయస్కులైన పేసర్ల జాబితాలో మోర్కెల్ నాలుగో స్థానంలో నిలిచాడు. జహీర్ ఖాన్ 35 ఏళ్ల 76 రోజుల వయసులో 300వ వికెట్‌ను ఖాతాలో వేసుకోగా.. రిచర్డ్ హ్యాడ్లీ (34 ఏళ్ల 233 రోజులు), ఇమ్రాన్ ఖాన్ (34 ఏళ్ల 221 రోజులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మోర్నీ మోర్కెల్ 34 ఏళ్ల 168 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం మోర్కెల్ మాట్లాడుతూ ఈ రికార్డు సాధించడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. దక్షిణాఫ్రికాకు ఆడటమే ప్రత్యేకమన్న మోర్కెల్‌.. భారత్‌పై అరంగేట్ర మ్యాచ్‌, టెస్టుల్లో నెంబర్ వన్‌గా నిలవడం, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను వారి సొంత గడ్డలపై ఓడించడం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతులని తెలిపాడు.

ఇదిలా ఉంటే రెండో రోజైన శుక్రవారం మోర్నీ మోర్కెల్(4/87) విజృంభణతో ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 245/9 పరుగులు చేసింది. ఒక వికెట్‌ చేతిలో ఉన్న ఆ జట్టు ఇంకా 66 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం పైన్‌(33), హేజిల్‌వుడ్‌ (1) పరుగుతో క్రీజులో ఉన్నారు.

మోర్కెల్ ధాటికి ఉస్మాన్ ఖవాజ(5), కెప్టెన్ స్మిత్(5), షాన్ మార్ష్(26) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. బాన్‌క్రాఫ్ట్(77) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, చివర్లో నాథన్ లియాన్(47), పైన్(33) తొమ్మిదో వికెట్‌కు 66 పరుగులు జోడించడంతో ఆసీస్‌కు ఈ మాత్రం స్కోరు దక్కింది.

సఫారీ బౌలర్లలో రబాడ(3/81), ఫిలాండర్(2/26) రాణించారు. అంతకుముందు 266/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 311 పరుగులకు ఆలౌటైంది. ఎల్గర్(141 నాటౌట్) అజేయ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేశాడు. కమ్మిన్స్(4/78) నాలుగు వికెట్లు తీయగా, హాజిల్‌వుడ్(2/59), లియాన్(2/43) రెండేసి వికెట్లు తీశారు.

స్కోరు వివరాలు:
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 311 ఆలౌట్‌
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 207/8

Story first published: Saturday, March 24, 2018, 16:04 [IST]
Other articles published on Mar 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X