న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంగూలీ బయోపిక్‌లో నటించే స్టార్ హీరో ఎవరో తెలుసా?!!

Sourav Ganguly wants Hrithik Roshan to play his character in his biopic

ముంబై: ప్రస్తుతం వెండితెరపై బయోపిక్‌లు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా క్రీడా నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రాలు పాపులర్ అయ్యాయి. ఇప్పటికే భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీల మీద వచ్చిన బయోపిక్స్ ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేశాయో అందరికీ తెలిసిందే. మేరీకోమ్, భాగ్ మిల్కా భాగ్, దంగల్ లాంటి క్రీడా నేపథ్య చిత్రాలు కూడా అభిమానులను అలరించాయి.

ఇస్రోపై ఆర్‌సీబీ జోక్.. ట్విట్టర్‌లో అభిమానుల ఆగ్రహం!!ఇస్రోపై ఆర్‌సీబీ జోక్.. ట్విట్టర్‌లో అభిమానుల ఆగ్రహం!!

గంగూలీ బయోపిక్‌?:

గంగూలీ బయోపిక్‌?:

బయోపిక్‌లు సిల్వర్ స్క్రీన్‌పై కాసులు కురిపిస్తున్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు అటు వైపు దృష్టి మరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో బయోపిక్ తెరకెక్కించేందుకు బాలీవుడ్‌లో ప్రయత్నాలు మొదలయ్యాయి. భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌, సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ కూడా త్వరలో రానుంది. ఈ బయోపిక్‌లో హీరోయిన్‌ తాప్సీ పొన్ను టైటిల్‌ పాత్రలో నటించనుంది. ఇక భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్‌ కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

హృతిక్ రోషనే నటించాలి:

హృతిక్ రోషనే నటించాలి:

ఇటీవల ఓ టాక్ షోలో సౌరవ్ గంగూలీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా.. 'ఒకవేళ మీ బయోపిక్ వస్తే.. అందులో ఏ హీరో టైటిల్ పాత్ర పోషించాలనుకుంటున్నారు' అని దాదాకు ఓ ప్రశ్న ఎదురైంది. 'హృతిక్ రోషన్. నేను అతన్ని ఎక్కువగా ఇష్టపడుతా' అని వెంటనే సమాధానం ఇచ్చాడు. ఒకవేళ దాదా బయోపిక్ వస్తే.. గంగూలీ కోరిక మేరకు దర్శకనిర్మాతలు హృతిక్ రోషన్‌ను తీసుకుంటారో లేదో చూడాలి.

 రిథమిక్‌ డ్యాన్సర్‌గా గుర్తింపు:

రిథమిక్‌ డ్యాన్సర్‌గా గుర్తింపు:

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్ రోషన్ భారతీయ సినిమాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన నటులలో ఒకడు. ఇతనికి దేశ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. హృతిక్‌ నటనతోనే కాక తన డ్యాన్స్‌తో కూడా అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తాడు. శరీరాన్ని స్ప్రింగ్‌లా తిప్పుతూ రిథమిక్‌ డ్యాన్సర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నాడు. ఈ ఏడాది 'సూపర్ 30', 'వార్' చిత్రాల ద్వారా మరోసారి హృతిక్ నిరూపించుకున్నాడు.

 తీవ్ర సంక్షోభవంలో పగ్గాలు:

తీవ్ర సంక్షోభవంలో పగ్గాలు:

2000వ సంవత్సరంలో భారత జట్టు కెప్టెన్‌గా గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో భారత క్రికెట్ తీవ్ర సంక్షోభవంలో ఉంది. అప్పట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం ఓ పెద్ద దుమారమే లేపింది. అలాంటి సమయంలో జట్టు పగ్గాలు అందుకున్న గంగూలీ.. తనదైన శైలిలో దూకుడు నేర్పించి టీమిండియా విదేశాల్లో సైతం టెస్టులు నెగ్గగలదని నిరూపించాడు. 2003లో టీమిండియాను ప్రపంచకప్‌ ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. తాజాగా అక్టోబర్ 23న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నాడు.

113 టెస్టులు, 311 వన్డేలు:

113 టెస్టులు, 311 వన్డేలు:

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలో గత ఆదివారం జరిగిన తొలి వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. జస్టిస్‌ లోధా కమిటీ సంస్కరణలలోని పదవీ కాలం పరిమితిని సడలించేందుకు ఆమోదం తెలిపింది. అయితే ఈ నిర్ణయాలకు సుప్రీంకోర్టు అంగీకరిస్తే.. గంగూలీ 2024 వరకు బీసీసీఐ బాస్‌గా కొనసాగే అవకాశం ఉంది. భారత్ తరపున దాదా 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు.

Story first published: Wednesday, December 4, 2019, 15:44 [IST]
Other articles published on Dec 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X