న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ తలపడే ప్రతి సిరిస్‌లోనూ ఓ డే నైట్ టెస్టు మ్యాచ్: గంగూలీ

Sourav Ganguly Wants At Least One Match In A Series To Be Pink-Ball Test

హైదరాబాద్: రాబోయే రోజుల్లో టీమిండియా తలపడే ప్రతి సిరీస్‌లోనూ ఒక డే నైట్‌ టెస్టు ఆడాలని తాను కోరుకుంటున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. ఈ విషయంపై బోర్డు సభ్యులతో చర్చిస్తానని దాదా పేర్కొన్నాడు. ఇటీవలే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లా జట్ల తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ పింక్ బాల్ టెస్ట్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారత్‌లో జరిగిన తొలి డే నైట్ టెస్టు కావడంతో పెద్దఎత్తున అభిమానులు హాజరై దానిని విజయవంతం చేశారు. పింక్ బాల్ టెస్టుకు హాజరైన అభిమానులను చూసి తన మది ఉప్పొంగిందని గంగూలీ ఈ సందర్భంగా వెల్లడించాడు. డే నైట్ టెస్టుతో నిండిన మైదానాన్ని చూసి తనకు ఎంతో ఆనందం కలిగిందని తెలిపాడు.

U-19 Cricket World Cup: తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కడు, ఎవరీ తిలక్ వర్మ?U-19 Cricket World Cup: తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కడు, ఎవరీ తిలక్ వర్మ?

గంగూలీ మాట్లాడుతూ

గంగూలీ మాట్లాడుతూ

ది వీక్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో గంగూలీ మాట్లాడుతూ "పింక్ బాల్ టెస్టుక్ హాజరైన అభిమానులను చూసి ఆనందమేసింది. ముందుకెళ్లడానికి ఇదే సరైన మార్గం. సిరీస్‌లో ఓ డే నైట్‌ టెస్టు మ్యాచ్ ఉంటే బాగుంటుంది. నా అనుభవాలను బోర్డు సభ్యులతో పంచుకుంటా. ఇతర వేదికల్లో కూడా పింక్ బాల్ టెస్టుని జరిపించేందుకు మేం ప్రయత్నిస్తాం" అని అన్నాడు.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా

ఈడెన్ గార్డెన్స్ వేదికగా

"ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ తర్వాత అంతా సిద్ధమయ్యారు. 5000 వేల మంది ముందు టెస్టు క్రికెట్ ఆడాలని ఎవరూ కోరుకోరు" అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌కు నాలుగు రోజుల టికెట్లు ముందుగానే అమ్ముడయ్యాయి.

పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు

పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు

అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం డే నైట్‌ టెస్టు బాగుందని అయితే ప్రతి టెస్టును అలా ఆడలేమని చెప్పడం విశేషం. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మూడు రోజుల్లోనే ముగించిన టీమిండియా

మూడు రోజుల్లోనే ముగించిన టీమిండియా

ఐదు రోజుల పాటు జరగాల్సిన మ్యాచ్‍‌ని కోహ్లీసేన కేవలం మూడు రోజుల్లోనే ముగించి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఈ క్రమంలో టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా నాలుగో ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.

Story first published: Tuesday, December 3, 2019, 16:37 [IST]
Other articles published on Dec 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X