న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన గంగూలీ!!

Sourav Ganguly Takes Over As BCCI President, Jay Shah starts his tenure as the new secretary

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టారు. ముంబైలోని బీసీసీఐ బోర్డు ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేషన్‌ దాఖలు చేయని సంగతి తెలిసిందే.

సన్నీ లియోన్‌ కన్నా యమ డేంజర్‌ ఎంఎస్ ధోనీనే!!సన్నీ లియోన్‌ కన్నా యమ డేంజర్‌ ఎంఎస్ ధోనీనే!!

65 ఏళ్లలో ఇదే తొలిసారి

ఒక మాజీ క్రికెటర్‌ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం 65 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇక బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రెండవ క్రికెటర్‌గా గంగూలీ రికార్డుల్లోకి ఎక్కారు. ఇంతకుముందు 1954-56 మధ్య కాలంలో మహరాజా ఆఫ్‌ విజయనగరం (పూసపాటి విజయానంద గజపతి రాజు) బోర్డు అధ్యక్షుడిగా ఉన్నారు. 2014లో సునీల్‌ గావాస్కర్‌, శివలాల్‌ యాదవ్‌ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. కానీ.. వారు కొన్ని నెలలు మాత్రమే తాత్కాలిక విధుల్లో ఉన్నారు.

అధ్యక్ష పదవిలో 10 నెలలు

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గంగూలీ మరో పది నెలలు (సెప్టెంబర్ 2020) పదవిలో ఉంటారు. అయిదేళ్లకు పైగా కోల్‌కతా క్రికెట్ బోర్డు (క్యాబ్) అధ్యక్షుడిగా పని చేసిన దాదా.. లోధా కమిటీ 'తప్పనిసరి విరామం' నిబంధనతో తర్వాత మూడేళ్ల విరామం తీసుకోవాలి. దాదా పగ్గాలు చేపట్టండంతో 33 నెలల పాటు బీసీసీఐని నడపించిన సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకుంది.

 బీసీసీఐ కార్యదర్శిగా జై షా

బీసీసీఐ కార్యదర్శిగా జై షా

దాదా బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగా.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా నియమితులయ్యారు. అనురాగ్‌ ఠాకూర్‌ తమ్ముడు అరుణ్‌ సింగ్‌ ధూమల్‌ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఉత్తరాఖండ్‌కు చెందిన మాహిమ్‌ వర్మ ఉపాధ్యక్షుడిగా, జాయింట్‌ సెక్రటరీగా జయేష్‌ జార్జ్‌ బాధ్యతలు స్వీకరించారు. అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఎన్నికలు నిర్వహించలేదు.

తప్పుకున్న సీఓఏ

తప్పుకున్న సీఓఏ

నూతన కార్యవర్గం బోర్డులో పూర్తిస్థాయి పాలన పగ్గాలు చేపట్టడంతో.. 33 నెలల పాటు బీసీసీఐని నడిపించిన సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకుంది. సీఓఏ కమిటీ సభ్యులు వినోద్‌ రాయ్‌, డయానా ఎడుల్జీ తమ పదవీ కాలానికి ఒక్కొక్కరికి రూ. 3.5 కోట్లు చెల్లించాలని బీసీసీఐ నిర్ణయించింది.

Story first published: Wednesday, October 23, 2019, 12:45 [IST]
Other articles published on Oct 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X