న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టీ20 ప్రపంచకప్‌ కోసం కొన్ని ఆలోచనలు ఉన్నాయి.. శాస్త్రి, కోహ్లీతో పంచుకుంటా'

Sourav Ganguly said Have some thoughts for T20 World Cup, will discuss with Virat Kohli and Ravi Shastri

కోల్‌కతా: ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం నా వద్ద కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పంచుకుంటా అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. టీ20 ప్రపంచకప్‌ను గెలవడమే తమ లక్ష్యమని గంగూలీ స్పష్టం చేసారు. గురువారం శర్మిష్ఠ గోప్తూ రచించిన 'మేనకా హ్యాజ్‌ హ్యాంగ్‌డ్‌ హర్‌సెల్ఫ్‌' అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత దాదా మీడియాతో మాట్లాడారు.

టీ20 ప్రపంచకప్‌ పేస్ విభాగంలో ఒక్కరికే అవకాశం: కోహ్లీటీ20 ప్రపంచకప్‌ పేస్ విభాగంలో ఒక్కరికే అవకాశం: కోహ్లీ

శాస్త్రి, కోహ్లీతో మాట్లాడుతా:

శాస్త్రి, కోహ్లీతో మాట్లాడుతా:

'టీ20 క్రికెట్‌లో లక్ష్యఛేదన అద్భుతంగా ఉంది. మొదట బ్యాటింగ్‌ చేసినప్పుడు కూడా అలాంటి ప్రదర్శన చేయాలి. దీనిపై నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, మేనేజ్‌మెంట్‌తో వాటిని పంచుకుంటా. ప్రస్తుతం టీమిండియా ఎక్కువ టీ20లు ఆడలేదు. ప్రపంచకప్‌ వరకు కోహ్లీసేన సిద్ధంగా ఉంటుంది' అని అన్నారు.

విదేశాల్లో నిలకడగా రాణించడమే లక్ష్యం:

విదేశాల్లో నిలకడగా రాణించడమే లక్ష్యం:

'విదేశాల్లో నిలకడగా రాణించడమే లక్ష్యం. గతేడాది ఆస్ట్రేలియాలో అద్భుతంగా రాణించాం. మళ్లీ ఆసీస్‌, న్యూజిలాండ్‌పై గెలిచే జట్టు మాకుంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండడం బాగుంది. టెస్టుల్లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉండడమే మా లక్ష్యం' అని గంగూలీ వెల్లడించారు.

ఆల్‌టైం బెస్ట్‌ సినిమా షోలే:

ఆల్‌టైం బెస్ట్‌ సినిమా షోలే:

'షోలే చిత్రం నా ఆల్‌టైం ఫేవరెట్‌. సినిమాల్లో నేను నటించగలనని అనుకోను. షోలేలో అమితాబ్‌ పాత్ర, గబ్బర్‌సింగ్‌ పాత్ర ఇష్టం. వాటిని నేను పోషించలేను. సత్యజిత్‌ రే చిత్రాల్లోని సౌమిత్ర ఛటోపాధ్యాయ విభిన్న పాత్రలు కూడా ఇష్టమే. సినిమాలు ఉపశమనం కలిగిస్తాయి. అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌, హృతిక్‌, ఆమిర్‌, సౌమిత్ర బాబు, ప్రసేన్‌జిత్‌ ఛటర్జీ, అబిర్‌ ఛటర్జీ మంచి నటులు' అని దాదా తెలిపారు.

Story first published: Wednesday, December 18, 2019, 18:15 [IST]
Other articles published on Dec 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X