న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్‌ వేయడం చాలా సంతోషంగా ఉంది'

Sourav Gangulys nomination for BCCI is excellent development, says CoA chief Vinod Rai

హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నామినేషన్‌ వేయడం తనకు చాలా సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్‌ రాయ్‌ అన్నారు. ఎంతో అనుభవం కలిగిన ఆటగాడు క్రికెట్ బాడీ వ్యవహారాలను నిర్వహించడం అద్భుతమని ఆయన తెలిపారు.

గంగూలీ నామినేషన్ విషయం తెలిసిన ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ పాలకుడిగా, టీమిండియా అత్యుత్తమ కెప్టెన్‌గా పనిచేసిన గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా నియామకం అయితే అది చాలా గొప్ప విషయమని ఆయన తెలిపారు. తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

"సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడైతే అది చాలా సంతోషకరమైన పరిణామం. బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ పాలకుడిగా, టీమిండియా అత్యుత్తమ కెప్టెన్‌గా పనిచేసిన గంగూలీ క్రికెట్ పరిపాలనలోకి రావడం అద్భుతమైన అభివృద్ధి" అని అన్నారు. ఐసీసీ మాజీ ఛైర్మన్‌ ఎన్‌ శ్రీనివాసన్‌, ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ రాజీవ్‌శుక్లాల గురించి మీడియా ప్రశ్నించగా తనదైన శైలిలో స్పందించారు.

No.1 ర్యాంకు: స్మిత్‌ను అధిగమించడానికి 2 పాయింట్ల దూరంలో కోహ్లీ!No.1 ర్యాంకు: స్మిత్‌ను అధిగమించడానికి 2 పాయింట్ల దూరంలో కోహ్లీ!

ప్రస్తుతం యుఎస్‌లో ఉన్నానని మీకు తెలుసు

ప్రస్తుతం యుఎస్‌లో ఉన్నానని మీకు తెలుసు

"నేను ప్రస్తుతం యుఎస్‌లో ఉన్నానని మీకు తెలుసు, నేను స్పందించిన ఏకైక విషయం గంగూలీ నామినేషన్. అతని ఎన్నిక చాలా సంతోషకరమైన పరిణామం అవుతుంది. అంతేకాదు గతం గురించి నాకు తెలియదు. భవిష్యత్‌వైపే తన దృష్టి" అని ఆయన వెల్లడించారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవికి సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే

అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే

ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడి హోదాలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే పోటీ చేస్తుండటంతో అతడి ఎన్నిక లాంఛనమే. అక్టోబర్ 23న గంగూలీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 2020 వరకు దాదా ఈ పదవిలో కొనసాగనున్నాడు.

సంతోషం వ్యక్తం చేసిన గంగూలీ

సంతోషం వ్యక్తం చేసిన గంగూలీ

గంగూలీ నామినేషన్ సందర్భంగా అతడి వెంట బీసీసీఐ మాజీ అధ్యక్షులు నిరంజన్‌ షా, ఎన్‌ శ్రీనివాసన్‌, ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లాలు ఉన్నారు. నామినేషన్ అనంతరం గంగూలీ మాట్లాడుతూ బీసీసీఐ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టానికి తాను సిద్ధంగా ఉండటమే కాకుండా, సంతోషంగా కూడా ఉన్నానని ఈ సందర్భంగా గంగూలీ తెలిపాడు.

ఈ పదవిని నేను ఎప్పుడూ ఆశించలేదు

ఈ పదవిని నేను ఎప్పుడూ ఆశించలేదు

"ఈ పదవిని నేను ఎప్పుడూ ఆశించలేదు. కనీసం ఎవరితోనూ చెప్పలేదు. ఆదివారం రాత్రి 10:30 వరకు కూడా ఈ విషయం నాకు తెలియదు. అప్పుడే చెప్పారు నువ్వే బీసీసీఐ ప్రెసిడెంట్ కావాలని. దేశం కోసం ఆడాను, సార‌థిగా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టాను, గ‌త మూడేళ్ల నుంచి బీసీసీఐ ప‌నితీరు స‌రిగా లేద‌ు. ఇలాంటి సంద‌ర్భంలో బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం గొప్ప అవ‌కాశ‌మే" అని గంగూలీ అన్నాడు.

మళ్లీ భారత క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకొస్తాం

మళ్లీ భారత క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకొస్తాం

"బీసీసీఐలో పరిస్థితులు చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. మరికొన్ని నెలల్లో అన్ని వ్యవస్థలు ప్రక్షాళన చేసి.. మళ్లీ భారత క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకొస్తాం. ఏక‌ప‌క్షంగా గెల‌వ‌డం ముఖ్యం కాదు అని, ప్ర‌పంచ క్రికెట్‌లోనే బీసీసీఐ అతిపెద్ద సంస్థ అని, దాని బాధ్య‌త‌లు చూసుకోవ‌డం ముఖ్య‌ం. ఆర్థిక‌ప‌రంగా బీసీసీఐ కీల‌క‌మైంది, అలాంటి సంస్థకు అధ్య‌క్ష బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డం స‌వాలే" అని గంగూలీ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, October 15, 2019, 11:57 [IST]
Other articles published on Oct 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X