న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'హర్భజన్‌ భారత క్రికెట్‌లో మార్పు తెస్తాడని అప్పుడే నమ్మకం కలిగింది'

Sourav Ganguly on early impression of Harbhajan Singhs bowling skills

ముంబై: ఈడెన్‌ గార్డెన్స్‌లో టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ 14 వికెట్లు పడగొట్టాడు. భారత క్రికెట్‌లో మార్పు తెస్తాడని నమ్మకం కలిగింది. ఆ తర్వాత అతను 800 వికెట్లు పడగొట్టాడు అని భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. హర్భజన్‌ 800 వికెట్లు తీయడంతో ఆశ్చర్యపోలేదు. హర్భజన్‌, అనిల్‌ కుంబ్లే భారత క్రికెట్‌కు దొరికిన ఆణిముత్యాలు అని దాదా కొనియాడారు.

క్లైవ్‌ లాయిడ్‌కు బ్రిటిష్‌ అత్యుత్తమ పురస్కారం.. దిగ్గజాల సరసన చోటు!!క్లైవ్‌ లాయిడ్‌కు బ్రిటిష్‌ అత్యుత్తమ పురస్కారం.. దిగ్గజాల సరసన చోటు!!

శనివారం ఇండియా టుడే ఇన్‌స్పిరేషన్‌ కార్యక్రమంలో భాగంగా దాదా మాట్లాడుతూ... 'కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక దూకుడు స్వభావం గల యువకులు జట్టులోకి వచ్చారు. హర్భజన్‌ ఈడెన్‌ గార్డెన్స్‌లో బౌలింగ్‌ చేయడం చూశా. అప్పుడతను 14 వికెట్లు పడగొట్టాడు. భజ్జీ భారత క్రికెట్‌లో మార్పు తెస్తాడని అప్పుడే నమ్మకం కలిగింది. ఆ తర్వాత అతను 800 వికెట్లు పడగొట్టాడు' అని అన్నారు.

'హర్భజన్‌ 800 వికెట్లు తీయడంతో ఆశ్చర్యపోలేదు. హర్భజన్‌, అనిల్‌ కుంబ్లే భారత క్రికెట్‌కు దొరికిన ఆణిముత్యాలు. ఇద్దరూ అత్యత్తమ స్పిన్నర్లు. టెస్టు క్రికెట్‌లో తమ ముద్ర వేశారు. జట్టులోకి యువకులు వచ్చాక విజయాలపై నమ్మకం కలిగింది. మ్యాచ్‌ విన్నర్లపై విశ్వాసం ఉంచా. భయం లేకుండా దూకుడుగా ఆడే ఆటగాళ్లపై నమ్మకముంచా. మ్యాచ్‌లు గెలవడానికి అదొక్కటే మార్గమని తెలుసుకున్నా. ఎప్పుడూ కూడా మ్యాచ్‌లు డ్రా చేసుకోడానికి ఇష్టపడలేదు. జట్టు గెలుపొందడం లేదా ఓటమిపాలవ్వడం మాత్రమే నమ్ముకున్నా' అని దాదా తెలిపారు.

'ఆస్ట్రేలియాతో 2001లో ఆడిన టెస్టు మ్యాచ్‌లో కుంబ్లే ఆడాల్సి ఉంది. కుంబ్లేకు గాయం కారణంగా భజ్జీ జట్టులోకి వచ్చాడు. జవగళ్‌ శ్రీనాథ్‌, కుంబ్లే ఇద్దరు ప్రధాన బౌలర్లు ఆ మ్యాచ్‌లో ఆడలేదు. భజ్జీ కొత్త ఆటగాడు. నేను ముగ్గురు స్పిన్నర్లతో ఆడా. అందులో భజ్జీ ఒక్కడే వికెట్లు తీశాడు. ఆ సమయంలో మేం చాలా కష్టపడ్డాం. మా కోచ్‌ జాన్‌రైట్‌ సహకారం చాలా గొప్పది. అప్పుడే భజ్జీ ఛాంపియన్‌లా బౌలింగ్‌ చేశాడు' అని గంగూలీ చెప్పుకొచ్చారు.

Story first published: Sunday, December 29, 2019, 13:56 [IST]
Other articles published on Dec 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X