న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహిళా క్రికెటర్లలో లేడీ 'విరాట్ కోహ్లీ' ఎవ‌రంటే?!!

Smriti Mandhana is the Virat Kohli of women’s cricket says Scott Styris

సిడ్నీ: టీమిండియా కెప్టెన్‌, పరుగుల మెషీన్‌ విరాట్‌ కోహ్లీ తన అద్భుత ఆటతో ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా నిలిచాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల సునామీ సృష్టిస్తూ.. దిగ్గజాల రికార్డులు ఒక్కొక్కటిగా కొల్లగొడుతూ వస్తున్నాడు. కోహ్లీని ఇప్పటికే ఎందరో మాజీ దిగ్గజాలతో పోల్చారు. ఇప్పుడు భారత మహిళా జట్టులోకి కీలక క్రీడాకారిణిని కోహ్లీతో పోల్చుతున్నారు. లేడీ 'విరాట్ కోహ్లీ' అని అంటున్నారు. ఆమె మరెవరో కాదు ఓపెనర్ స్మృతి మంధాన‌.

ప్ర‌జ్ఞాన్ ఓజా రిటైర్మెంట్‌.. ఎమోషనలైన రోహిత్, సచిన్!!ప్ర‌జ్ఞాన్ ఓజా రిటైర్మెంట్‌.. ఎమోషనలైన రోహిత్, సచిన్!!

లేడీ 'విరాట్ కోహ్లీ':

లేడీ 'విరాట్ కోహ్లీ':

న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్, కామెంటేటర్ స్కాట్ స్టైరిస్.. స్మృతి మంధాన‌ను విరాట్ కోహ్లీతో పోల్చాడు. లేడీ 'విరాట్ కోహ్లీ' అని కితాబిచ్చేశాడు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కి స్టైరిస్ వ్యాఖ్యానం చేసాడు. మంధాన‌ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. దూకుడు, విధ్వంస‌క ఆట‌తీరు క‌ల‌బోసిన ప్లేయ‌ర్‌గా మంధాన‌ను స్టైరిస్ అభివ‌ర్ణించాడు. ఈ మ్యాచ్‌లో మంధాన‌ 11 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.

రిచర్డ్స్ మాదిరిగానే మంధనా:

రిచర్డ్స్ మాదిరిగానే మంధనా:

స్కాట్ స్టైరిస్ మాట్లాడుతూ... 'మంధనా మహిళల క్రికెట్‌లో లేడీ విరాట్ కోహ్లీ. గతంలో పురుషుల క్రికెట్‌ను వెస్టిండీస్ దిగ్గజం వీవ్ రిచ‌ర్డ్స్ త‌న అద్భుత ఆట‌తో మ‌లుపుతిప్పాడు. ఇప్పుడు మంధనా అలానే ఆడుతోంది. రిచర్డ్స్ మాదిరిగానే మంధనా గుర్తించబడుతుంది' అని పేర్కొన్నారు. అప్పట్లో వన్డే, టెస్ట్ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్‌తో పోల్చిన విషయం తెలిసిందే.

డబుల్ సెంచ‌రీతో:

డబుల్ సెంచ‌రీతో:

2013 వెస్ట్‌జోన్ అండ‌ర్‌-19 టోర్నీలోని ఓ వ‌న్డేలో స్మృతి మంధాన‌ తొలి డబుల్ సెంచ‌రీతో అందరిని ఆకర్షించింది. ఆ మ్యాచ్‌లో 154 బంతుల్లోనే 224 ప‌రుగులు చేసి అందరి చూపిన ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. ఇక భారత జట్టులోకి వచ్చిన ఆనతి కాలంలోనే తనదైన ముద్ర వేసింది. తన సంచలన ఆటతో బీసీసీఐ, ఐసీసీ అవార్డులను సొంతం చేసుకుంది. బీసీసీఐ నుంచి బెస్ట్ విమెన్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్ అవార్డు అందుకుంది. ఇక ఐసీసీ నుంచి రేచ్ హేయో ఫ్లింట్ అవార్డు, వ‌న్డే ప్లేయ‌ర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సాధించింది.

17 పరుగుల తేడాతో విజయం:

17 పరుగుల తేడాతో విజయం:

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగడంతో.. లక్ష్య ఛేదనలో ఆసీస్ 19.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళలు ఘనమైన బోణీ కొట్టారు. దీప్తి శర్మ (49; 46 బంతుల్లో 3 ఫోర్లు), షెఫాలీ వర్మ (29; 15 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించారు.

Story first published: Saturday, February 22, 2020, 17:33 [IST]
Other articles published on Feb 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X