స్మిత్‌కు అలెన్ బోర్డర్ మెడల్: ఐదో క్రికెటర్‌గా అరుదైన ఘనత

Posted By:
 Smith, Perry claim top cricket honours

హైదరాబాద్: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ రెండోసారి అలెన్ బోర్డర్ మెడల్‌ను అందుకున్నాడు. గతేడాది స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు రెండు పెద్ద సిరిస్‌లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 8, 2017 నుంచి జనవరి 8, 2018 వరకు నిర్వహించిన ఓటింగ్‌ ప్రక్రియ ఆధారంగా క్రికెట్ ఆస్ట్రేలియా విజేతలను ప్రకటించింది. మెల్‌బోర్న్‌లో పల్లాడియం క్రౌన్‌లో ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గతేడాది అద్భుత ప్రదర్శన చేసిన పురుష, మహిళా క్రికెటర్లకు అలెన్‌ బోర్డర్‌, బెలిందా క్లార్క్‌ పతకాలను అందజేశారు.

 ఐదో క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్

ఐదో క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్

2017 సంవత్సరానికి గాను క్రికెట్ అలెన్ బోర్డర్ పతకాన్ని స్టీవ్ స్మిత్ దక్కించుకోగా, బెలిందా క్లార్క్ పతకానికి ఆసీస్ మహిళా జట్టు క్రికెటర్ ఎల్లీ పెర్రీకి దక్కింది. ఒకటి కంటే ఎక్కువ సార్లు అలెన్ బోర్డర్ పతకాన్ని దక్కించుకున్న క్రికెటర్ల జాబితాలో స్టీవ్ స్మిత్ ఐదోవాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా రెండుసార్లు అలెన్ బోర్డర్ పతకాన్ని రెండు సార్లు దక్కించుకున్నాడు.

 గతేడాది 1305 టెస్టు పరుగులు

గతేడాది 1305 టెస్టు పరుగులు

గతేడాది స్టీవ్ స్మిత్ 81.56 యావరేజితో మొత్తం 1305 టెస్టు పరుగులు నమోదు చేశాడు. ఇందులో మొత్తం ఆరు సెంచరీలు ఉన్నాయి. భారత్‌తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో స్టీవ్ స్మిత్ 62.75 యావరేజితో 499 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక, ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరిస్‌లో సైతం స్మిత్ రెచ్చిపోయి ఆడాడు. యాషెస్ సిరిస్‌లో 137.40 యావరేజితో 687 పరుగులు చేశాడు.

టెస్టు క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా

టెస్టు క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా

ఇక, వన్డే క్రికెట్ విషయానికి వస్తే 44.90 యావరేజితో 449 పరుగులు నమోదు చేశాడు. ఇలా, 2017లో స్టీవ్ స్మిత్ అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు ఐసీసీ టెస్టు క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు. ఓటింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు మొత్తం 246 ఓట్లు పోలయ్యాయి. వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు 162 ఓట్లు పోలయ్యాయి. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన అవార్డుల్లో వార్నర్‌కు వన్డే ప్లేయర్ ఆఫ్ ద అవార్డు లభించింది. 156 ఓట్లతో మూడో స్థానంలో నిలిచిన నాథన్ లియాన్‌ను టెస్టు ప్లేయర్ ఆఫ్ ద అవార్డు వరించింది.

 మహిళల క్రికెట్‌లో ఎల్లీ పెర్రీ

మహిళల క్రికెట్‌లో ఎల్లీ పెర్రీ

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఎల్లీ పెర్రీ గతేడాది అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోరుని నమోదు చేసింది. నవంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పెర్రీ (213) పరుగులతో డబుల్ సెంచరీని నమోదు చేసింది. 2016లో కూడా పెర్రీ బెలిందా క్లార్క్‌ పతకాన్ని అందుకుంది. మూడు ఫార్మాట్లలో కూడా ఆస్ట్రేలియా తరుపున అత్యధిక పరుగులు 68.73 యావరేజితో 756 పరుగులు నమోదు చేసింది. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇక బౌలింగ్‌లో 25.20 యావరేజితో 20 వికెట్లు తీసింది. ఈ కార్యక్రమానికి ఆసీస్ ‌మాజీ, ప్రస్తుత క్రికెటర్లు హాజరయ్యారు.

కార్యక్రమానికి క్రికెటర్ల భార్యలు కూడా హాజరు

ఈ కార్యక్రమానికి క్రికెటర్ల భార్యలు సైతం హాజరయ్యారు. ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌, స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ మ్యాక్స్‌వెల్‌ తదితరులు కుటుంబసభ్యులతో సహా హాజరయ్యారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి స్టీవ్ స్మిత్‌కి కాబోయే భార్య డేని విల్లీస్‌, డేవిడ్ వార్నర్ భార్య కాన్డైస్ వార్నర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరి అందానికి ఫిదా అయిన నెటిజన్లు ‘చాలా బాగున్నారు' అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

Story first published: Monday, February 12, 2018, 18:32 [IST]
Other articles published on Feb 12, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి