న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భారత్‌లా కాదు.. ఐర్లాండ్‌లో వ్యవస్థలు అన్నీ పారదర్శకం'

Simi reflects on tough times ahead of first appearance against India

హైదరాబాద్: భారత్‌లో పుట్టి అవకాశాలు రాకపోవడంతో.. ఐర్లాండ్‌కు వలస వెళ్లిన క్రికెటర్ సిమీసింగ్. తాజాగా ఇండియాలో వ్యవస్థలు కంటే ఐర్లాండ్‌లోవి ఉత్తమం అని ఎద్దేవా చేశాడు. భారత్‌తో పోలుస్తూ 'అక్కడలా గోప్యంగా జరగవు. అన్నీ పారదర్శకంగా ఉంటాయి' అని అన్నాడు. ఐర్లాండ్‌ క్రికెటర్‌ సిమి సింగ్‌. భారత్‌లో పుట్టి పంజాబ్‌ తరఫున క్రికెట్‌ ఆడిన సిమి సింగ్‌ ఆ తర్వాత చదువు కోసం ఐర్లాండ్‌ వెళ్లాడు.

1
43318

'నా జీవితంలో ఇదో కఠినమైన ప్రయాణం. భారత జాతీయ జట్టు తరఫున క్రికెట్‌ ఆడాలని కలలు కన్నాను. కానీ, ఇప్పుడు నేను ఐర్లాండ్‌ జట్టుకు ఆడుతున్నాను. ఈ రకంగానైనా జాతీయ జట్టుకు ఆడాలన్న నా కల నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఐర్లాండ్‌లో పద్ధతులన్ని ఎంతో పారదర్శకంగా ఉంటాయి. భారత్‌ వలే కాదు. ఇలా నేను వెలుగులోకి వచ్చానంటే... అందుకు కారణం క్రికెట్‌.'

నా కుటుంబానికి ఎంతో బాధ కలిగించే

నా కుటుంబానికి ఎంతో బాధ కలిగించే

'అక్కడ అవకాశాల కోసం ఉన్నంత కాలం నాకు, నా కుటుంబానికి ఎంతో బాధ కలిగించేది. ఎందుకంటే భారత్‌ తరఫున ఆడలేకపోవడంతో పాటు భారత్‌పైనే ఆడాల్సి వచ్చినందుకు. గతంలో వారాంతంలో క్రికెట్‌ ఆడేందుకు ప్రతి గేమ్‌కి ఐదు యూరోలు ఇచ్చేవాడిని. అప్పుడు ఇక్కడ ఓ దుకాణంలో పనిచేసేవాడిని' అని సిమి తెలిపాడు.

సిమి చాలా కష్టపడేవాడు.

సిమి చాలా కష్టపడేవాడు.

పంజాబ్‌లో సిమికి శిక్షణ ఇచ్చిన కోచ్‌ భారతి విజ్‌ మాట్లాడుతూ...‘సిమి చాలా కష్టపడేవాడు. పంజాబ్‌ తరఫున అండర్‌-19 క్రికెట్‌ ఆడే సమయంలో సిమికి అవకాశాలు దక్కలేదు. దీంతో అతడు తన ప్రతిభను నిరూపించుకోలేకపోయాడు. అతన్ని సరిగా ట్రీట్‌ చేసే వారు కూడా కాదు' అని విజ్‌ వివరించాడు.

ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగిన సిమీ సింగ్

ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగిన సిమీ సింగ్

భారత్‌తో జరిగిన తొలి టీ20లో ఐర్లాండ్‌ జట్టులో సిమి సింగ్‌ చోటు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్‌ సిమి సింగ్‌ 7 పరుగులు చేశాడు. ఒక ఓవర్‌ వేసి 12 పరుగులిచ్చాడు. మ్యాచ్‌కు ముందు మాట్లాడిన సిమీ.. కోహ్లీ, ధోనీలను నేరుగా కలిసింది లేదంటూ ఇప్పుడే చూస్తున్నానంటూ ఉద్వేగపడ్డాడు.

తొలి టీ20లో భారత్ విజయం

తొలి టీ20లో భారత్ విజయం

స్వదేశంలో క్రికెట్‌లో సరైన అవకాశాలు రాకపోవడంతో ఐర్లాండ్‌లో క్రికెట్‌‌ ఆడటం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ దేశ జట్టు తరఫున ఆడుతున్నాడు. తాజాగా అతడు భారత్‌పైనే ఆడుతున్నాడు. ప్రస్తుతం కోహ్లీ సేన ఐర్లాండ్‌లో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా ఆతిథ్య ఐర్లాండ్‌ రెండు టీ20లు ఆడుతోంది. బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్‌ శుక్రవారం ఆడనుంది.

Story first published: Thursday, June 28, 2018, 19:59 [IST]
Other articles published on Jun 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X