న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎందుకో తెలియదు.. హార్దిక్‌ పాండ్యా స్లెడ్జింగ్‌ చేసాడు: గిల్‌

Shubman Gill Recalls Hardik Pandyas Funny Sledge During Domestic Game

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఓసారి తనని స్లెడ్జింగ్‌ చేశాడని యువ సంచలనం శుభ్‌మన్‌ గిల్‌ తెలిపాడు. ఎందుకు స్లెడ్జింగ్‌ చేసాడో తనకి ఇప్పటికీ తెలియదు అని గిల్ అన్నాడు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో శుభ్‌మన్‌ గిల్‌ కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. ఈ ఖాళీ సమయంలో దేహదారుఢ్యం, బ్యాటింగ్‌ టెక్నిక్‌పై దృష్టి సారిస్తున్నాడు. గిల్ భారత్ తరఫున రెండు వన్డేలు ఆడి 16 పరుగులు చేసాడు.

తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తమ ఆటగాళ్లతో ట్విటర్‌లో ముచ్చటించింది. ఈ సందర్భంగా శుభ్‌మన్‌ గిల్‌ ట్విటర్ లైవ్ షోలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఒక బ్యాట్స్‌మన్‌గా ఎదురైన సరదా స్లెడ్జింగ్‌ ఘటనను చెప్పాలని శుభ్‌మన్‌ను కేకేఆర్ అడిగింది. 'నేను రంజీ ట్రోఫీ ఆడే సీజన్ అది‌. ఒకసారి వన్డే క్రికెట్‌లో బరోడాతో మ్యాచ్‌ ఆడుతుండగా పాండ్యా బౌలింగ్‌ చేస్తూ నన్ను స్లెడ్జింగ్‌ చేశాడు. అలా ఎందుకు చేశాడో నాకు తెలియదు. అతడు బౌలింగ్‌ చేస్తుంటే.. నేను ధాటిగా ఆడాలని చూశా. షాట్ ఆడగా ఒక బంతి నేరుగా ఫీల్డర్‌ దగ్గరికి వెళ్లింది. దాంతో అతడు నన్ను రెచ్చగొట్టాడు. 'రా.. రా.. నా బంతులు ఎదుర్కో. ఇది అండర్‌ 19 క్రికెట్‌ కాదు' అని పదేపదే అన్నాడఅని గిల్‌ గుర్తుచేసుకున్నాడు.

శుభ్‌మన్‌ గిల్‌ 2018 అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో అత్యధిక పరుగులు (372) చేసి 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న అతడికి గతేడాది టీమిండియాలో అవకాశం వచ్చింది. న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికై ఒక మ్యాచ్‌ ఆడాడు. తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైనా ఆడే అవకాశం దక్కలేదు.

టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం ఇటీవల శుభ్‌మన్‌ గిల్‌ గురించి మంచి అభిప్రాయం వ్యక్తం చేశాడు. లాక్‌డౌన్‌ వేళ ఏప్రిల్‌లో వెటరన్ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుతూ అతడిని ప్రశంసించాడు. 'గిల్‌ అద్భుతమైన బ్యాట్స్‌మన్‌. భారత జట్టులో మంచి భవిష్యత్‌ ఉన్న ఆటగాడు. ఎప్పుడైతే నిలకడగా పరుగులు చేస్తాడో అప్పుడు అతడికి నమ్మకం కలుగుతుంది. అతడికి దేశవాళీలో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. అతడిని మనం జట్టులోకి తీసుకురాడానికి ప్రయత్నించాలి. అయితే జట్టులో చాలా పోటీ ఉంది' అని అన్నాడు.

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌.. గతంలో శుభ్‌మన్‌ గిల్‌ ఎడిటింగ్‌ స్కిల్స్‌పై కామెంట్ చేసారు. 'ఆ ఎడిటింగ్‌ అతనే చేశారని భావిస్తున్నారా?' అంటూ కామెంట్‌ చేశారు. ఈ ఒక్క కామెంట్ కారణంగా గిల్, సారా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సారానే ఈ ఎడిటింగ్‌ చేసి ఉంటారని కొందరు అనగా.. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని మరికొందరు కామెంట్‌లు చేసారు. ఇద్దరు మంచి స్నేహితులు అని ఇంకొందరు అన్నారు. డేటింగ్‌ నిజమో? అబద్దమో? తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం తమకు ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేసారు. అయితే ఈ వార్తలపై మాత్రం ఎవరూ స్పందించకపోవడం విశేషం.

కోలీ స్పెల్లింగ్‌ సరిచేసుకో.. అభిమానికి రోహిత్ పంచ్!!కోలీ స్పెల్లింగ్‌ సరిచేసుకో.. అభిమానికి రోహిత్ పంచ్!!

Story first published: Monday, June 15, 2020, 8:26 [IST]
Other articles published on Jun 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X