న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

4 దశాబ్దాల్లో క్రికెట్ ఆడిన మాలిక్.. పాక్ తరఫున తొలి క్రికెటర్‌గా రికార్డు!!

Shoaib Malik becomes 1st Pakistan cricketer to achieve elusive feat, joins Sachin in elite list

లాహోర్‌: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇటీవలే పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌తో మళ్లీ పాకిస్థాన్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. తొలి టీ20లో షోయబ్‌ మాలిక్‌ (45 బంతుల్లో 58 నాటౌట్‌; 5 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. రెండో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక మూడో టీ20 వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య పాక్‌ 2-0తో సొంతం చేసుకొంది.

కివీస్‌తో మూడో టీ20: సైనీకి ఛాన్స్.. భారత్ తుది జట్టు ఇదేనా?!!కివీస్‌తో మూడో టీ20: సైనీకి ఛాన్స్.. భారత్ తుది జట్టు ఇదేనా?!!

అరుదైన రికార్డులో చోటు:

అరుదైన రికార్డులో చోటు:

బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడడంతో షోయబ్ మాలిక్ ఓ అరుదైన రికార్డులో చోటు దక్కించుకున్నాడు. 4 దశాబ్దాల్లో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడిగా మాలిక్ గుర్తింపు పొందాడు. ఈ ఘనతను అందుకున్న ఎనిమిదో ప్లేయర్‌గా నిలిచాడు. 1999లో వెస్టిండీస్‌తో మాలిక్ అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. 1990-2000, 2000-10, 2010-20, 2020- 2030 నాలుగు దశాబ్దాల్లోనూ మాలిక్ మ్యాచ్‌లు ఆడాడు.

ఏడుగురు మాత్రమే:

ఏడుగురు మాత్రమే:

క్రికెట్ ప్రపంచంలో ఇప్పటి వరకూ నాలుగు దశాబ్దాలు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు ఏడుగురు మాత్రమే ఉన్నారు. అయితే పాకిస్థాన్ తరఫున మాత్రం షోయబ్ మాలిక్ తొలి క్రికెటర్ కావడం విశేషం. సచిన్ టెండూల్కర్ (భారత్), సనత్ జయసూర్య (శ్రీలంక), విల్‌ప్రెడ్ రోడ్స్ (ఇంగ్లాండ్), బ్రైన్ క్లోస్ (ఇంగ్లాండ్), ప్రాంక్ వూలీ (ఇంగ్లాండ్), జాక్ హబ్స్ (ఇంగ్లాండ్), జార్జ్ గన్ (ఇంగ్లాండ్) ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా వీరి సరసన మాలిక్ చేరాడు.

వన్డే ఫార్మాట్‌కి రిటైర్మెంట్:

వన్డే ఫార్మాట్‌కి రిటైర్మెంట్:

గత ఏడాది వన్డే ప్రపంచకప్-2019 సమయంలో మాలిక్ వన్డే ఫార్మాట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెగెలిసిందే. ఈ ఏడాది అక్టోబరులో టీ20 ప్రపంచకప్ వరకూ మాలిక్ పాక్ జట్టులో కొనసాగే అవకాశం ఉంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్, ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన మాలిక్ పాక్ తరఫున 35 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. 287 వన్డేలు, 113 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే మైదానంలో అడుగుపెట్టిన మాలిక్ సతీమణి, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్న విషయం తెలిసిందే.

Story first published: Tuesday, January 28, 2020, 16:49 [IST]
Other articles published on Jan 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X