న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'హఫీజ్‌ది కచ్చితంగా తప్పే.. ట్విట్టర్‌లో అది పోస్ట్ చేయాల్సింది కాదు'

Shoaib Akhtar said Mohammad Hafeez should not have posted his Coronavirus test results on Twitter

లాహోర్‌: పాకిస్థాన్‌ సీనియర్ ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ హఫీజ్‌ కరోనా వైరస్ రిపోర్ట్‌ను ట్విట్టర్‌లో వెల్లడించకుండా ఉండాల్సిందని ఆ దేశ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు. కరోనా పరీక్షలు వ్యక్తిగతంగా చేయించుకోవడం తప్పుకాదని, కానీ రిపోర్టులను సామాజిక మాధ్యమాల్లో పెట్టడం మాత్రం కచ్చితంగా తప్పే అని ఆయన అన్నాడు. ఈ వ్యవహారంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఆటగాళ్ల మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోందన్నాడు.

కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది

కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది

ఆదివారం షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఆటగాళ్ల మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. వైరస్ ప్రభావం లాహోర్, కరాచీలో ఎక్కువుగా ఉంది. పరీక్షలను కొనసాగిస్తే మరింత సానుకూల ఫలితాలను పొందుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. టెస్టులు ముగిసిన తర్వాత హఫీజ్.. రీ టెస్టు చేసుకోవడాన్ని నేను వ్యతిరేకించడం లేదు. కానీ రిజల్ట్‌ని ట్విట్టర్ పోస్ట్ చేయడం సమంజసం కాదు' అని అన్నాడు. అక్తర్‌ పాక్‌ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు.

హఫీజ్‌ది కచ్చితంగా తప్పే:

హఫీజ్‌ది కచ్చితంగా తప్పే:

'మహమ్మద్‌ హఫీజ్ ట్విట్టర్‌లో రిసల్ట్ పోస్ట్ చేయడం పాక్ బోర్డు గురించి తప్పుడు సంకేతాలు ఇవ్వడమే అవుతుంది. హఫీజ్‌ది కచ్చితంగా తప్పే. ట్విట్టర్‌లో అలా పోస్ట్ చేయాల్సింది కాదు. పాక్‌ జట్టుకు ఇంగ్లండ్‌ పర్యటన చాలా ముఖ్యమైనది. ఇంగ్లిష్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ నెగ్గాలంటే అత్యుత్తమ జట్టును పంపాలి' అని అక్తర్ పేర్కొన్నాడు. 2003లో పాకిస్థాన్ జట్టులోకి అరంగేట్రం చేసిన మహ్మద్ హఫీజ్.. ఇప్పటి వరకు 55 టెస్టులు, 218 వన్డేలు, 91 టీ20లు ‌ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 21 సెంచరీలు బాదాడు. మొత్తంగా 12,258 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ 246 వికెట్లు పడగొట్టాడు.

వ్యక్తిగతంగా కరోనా టెస్టులు:

వ్యక్తిగతంగా కరోనా టెస్టులు:

ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన 29 మంది ఆటగాళ్లకి గత సోమవారం వైరస్ టెస్టులు చేయించిన పీసీబీ.. జట్టులోని 10 మంది క్రికెటర్లకి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మంగళవారం ప్రకటించింది. ఇందులో మహమ్మద్‌ హఫీజ్ కూడా ఉన్నాడు. పీసీబీ ప్రకటన తర్వాత రోజే వ్యక్తిగతంగా తన ఫ్యామిలీతో కలిసి హఫీజ్ కరోనా టెస్టులు చేయించుకోగా.. అందరికీ నెగటివ్ వచ్చింది. అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా హఫీజ్ వెల్లడించాడు. బోర్డుకి తెలియకుండా హఫీజ్ టెస్టు చేయించుకోవడం.. రిజల్ట్‌ని ప్రకటించడంపై పీసీబీ సీరియస్ అయ్యింది.

మరోసారి వైరస్ టెస్టులు

మరోసారి వైరస్ టెస్టులు

మహమ్మద్‌ హఫీజ్ అత్యుత్సాహం కారణంగా జట్టులోని మిగతా 9 మంది ఆటగాళ్లలో ఆందోళన నెలకొంది. మరోసారి వైరస్ టెస్టులు చేయాలని పట్టుబట్టారు. దీంతో పీసీబీ శుక్రవారం మరోసారి 10 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయించగా.. ఇందులో ఆరుగురికి పాజిటివ్ అని తేలింది. ఇందులో హఫీజ్ కూడా ఉన్నాడు. దీంతో హఫీజ్ తొందరపాటుపై అందరూ మండిపడుతున్నారు. ఇక ఇంగ్లాండ్ టూర్‌కి ఆదివారం బయల్దేరిన పాకిస్థాన్ జట్టుతో వైరస్ సోకినా 10 మందిని పంపలేదు. మరో రెండు సార్లు పరీక్షలు చేసిన తర్వాత నెగటివ్ వస్తే అప్పుడు పంపుతామని పీసీబీ పేర్కొంది.

సెల్ఫ్‌ ఐసోలేషన్‌‌లో ఉంటానని.. క్లబ్‌లో పార్టీ చేసుకున్న స్టార్ ప్లేయర్ (వీడియో)!!

Story first published: Monday, June 29, 2020, 14:13 [IST]
Other articles published on Jun 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X