న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పాకిస్థాన్‌ క్రికెట్‌ మంచి కోసం.. నా సుఖమైన దినచర్యను వదులుకోడానికి సిద్ధం'

Shoaib Akhtar confirms he is in talks with PCB to take up major role in Pakistan cricket

కరాచీ: పాకిస్తాన్ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చీఫ్‌ సెలెక్టర్‌ మిస్బా ఉల్‌ హక్‌ స్థానాన్ని త్వరలో మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ భర్తీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా అక్తర్‌ స్పందించాడు. ప్రస్తుతం పీసీబీతో చర్చలు జరుపుతున్నట్లు, దాన్ని దాచాల్సిన అవసరం లేదన్నాడు. ప్రస్తుతానికి చర్చలు మాత్రమే జరుగుతున్నాయని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ స్పష్టం చేశాడు.

'సీఎస్‌కేకు ధోనీ ఆత్మ లాంటివాడు.. మహీ ఉన్నంత‌కాలం ఆ జట్టు బ‌తికే ఉంటుంది''సీఎస్‌కేకు ధోనీ ఆత్మ లాంటివాడు.. మహీ ఉన్నంత‌కాలం ఆ జట్టు బ‌తికే ఉంటుంది'

పీసీబీతో చర్చలు జరుపుతున్నా:

పీసీబీతో చర్చలు జరుపుతున్నా:

తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో షోయబ్‌ అక్తర్‌ మాట్లాడుతూ... 'అది నిజమే. చీఫ్‌ సెలెక్టర్ పదవిపై ప్రస్తుతం పీసీబీతో చర్చలు జరుపుతున్నా. ఈ విషయంలో నేనూ ఆసక్తిగానే ఉన్నా. ఇప్పటికైతే తుది నిర్ణయం తీసుకోలేదు. అంతకుమించి ఇప్పుడు ఏం చెప్పలేను. ప్రస్తుతం నేను చాలా మంచి స్థితిలో ఉన్నా. నా శక్తి మేరకు క్రికెట్‌ ఆడాను. ఇప్పుడు బాగానే సెటిలయ్యాను. అయితే పాకిస్థాన్‌ క్రికెట్‌ మంచి కోసం నా సుఖమైన దినచర్యను కూడా వదులుకోడానికి సిద్ధంగా ఉన్నా' అని అన్నాడు.

నేను అలా కాదు:

నేను అలా కాదు:

'అవకాశం వస్తే ఆ బాధ్యతలు (చీఫ్‌ సెలెక్టర్) తప్పకుండా తీసుకుంటా. నిజం చెప్పాలంటే నాకే పదవి, బాధ్యతలు అవసరం లేదు. జీతం కోసం పనిచేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. సాధారణ ప్రజలు డబ్బుల కోసం పనిచేస్తారు. నేను అలా కాదు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బాగుంటే చాలు' అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు. పాకిస్థాన్‌ జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఉందని, మాజీ దిగ్గజాలైన జావెద్‌ మియాందాద్‌, వసీం అక్రమ్‌, ముస్తక్‌ మహ్మద్‌ లాంటి ఆటగాళ్లను తయారుచేయాలనుందన్నాడు. 15 మంది మ్యాచ్‌ విన్నర్లను కూడా తయారు చేసి వారికి పూర్తి భరోసానిస్తే తమ‌ జట్టు మెరుగవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

వారిని ఎలా విమర్శించాలి:

వారిని ఎలా విమర్శించాలి:

'నేనేం చెప్పాలో మీరే చెప్పండి. విరాట్ కోహ్లీ టాప్‌ బ్యాట్స్‌మన్‌ మాత్రమే కాదు. 70 అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడు. కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. టీమిండియాకు ఎన్నో విజయాలు అందిస్తున్నారు. అలాంటప్పుడు వారిని ఎలా తిట్టగలను?. ఒక కచ్చితమైన ప్రణాళిక, దూకుడు స్వభావంతో భారత్‌ ముందుకు దూసుకు వెళుతోంది. జస్ప్రీత్ బుమ్రానే ఉదాహరణగా తీసుకోండి. అతడు ఎంతో మెరుగయ్యాడు. అలాంటి ఆటగాడిని ఏమని విమర్శించాలి?' అని టీమిండియా ఆటగాళ్లను పొగడడంపై వచ్చే విమర్శలపై అక్తర్‌ ఎదురు ప్రశ్నించాడు.

163 వన్డేల్లో 247 వికెట్లు:

163 వన్డేల్లో 247 వికెట్లు:

అక్తర్‌ పాక్‌ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. 444 వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Story first published: Friday, September 11, 2020, 18:07 [IST]
Other articles published on Sep 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X