న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డాన్ ఆఫ్ క్రికెట్‌గా షోయబ్: సచిన్ బాదిన సిక్స్‌ని మరిచిపోయావా? అంటూ ట్రోల్

Shoaib Akhtar Calls Himself Don Of Cricket, Twitter Reminds Him Of Sachin Tendulkar Heroics

హైదరాబాద్: ట్విట్టర్‌లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తనకు తనే డాన్ అని ప్రకటించుకున్నాడు. ఈ వ్యాఖ్యలు క్రికెట్‌ అభిమానులుకు ఆగ్రహం తెప్పించాయి. ఇంకేముంది ట్విట్టర్ వేదికగా షోయబ్ అక్తర్‌ను నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

ట్విట్టర్‌లో షోయబ్ అక్తర్ తన బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డ వివిధ దేశాల ఆటగాళ్లందరి ఫొటో పెట్టి అందుకు క్యాప్షన్‌గా "వారంతా నన్ను క్రికెట్‌ డాన్‌ అని పిలిచేవారు. నా బౌలింగ్‌ శైలిని అలా ఉండేది. వాళ్లను గాయపరిచి ఎంజాయ్‌ చేసేవాడిని కాదు. కానీ నా దేశ కోసం.. నా అభిమానుల కోసం నేను అలా ఆడేవాడినని చెప్పగలను" అని ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌పై క్రికెట్ అభిమానులు జోకులు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ సచిన్ అభిమాని "ఏ షోయబ్‌ సచిన్‌ టెండూల్కర్‌ను మరిచిపోయావా?" అని ప్రశ్నిస్తూ షోయబ్‌ బౌలింగ్‌‌లో సచిన్ టెండూల్కర్ సిక్స్ బాదిన వీడియోని పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అయింది.

సఫారీ గడ్డపై సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ వన్డేలో షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో సచిన్ టెండూల్కర్ పరుగుల వరద పారించాడు. ఈ మ్యాచ్ ‌సచిన్ 75 బంతుల్లో 98 పరుగులు చేశాడు. దీంతో పాకిస్థాన్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

43 ఏళ్ల షోయబ్ అక్తర్ పాక్ తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లో 400కుపైగా వికెట్లు తీశాడు. అక్తర్‌కు అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు రావల్పిండి ఎక్స్‌ప్రెస్. పాక్ తరుపున షోయబ్ అక్తర్ 46 టెస్టులు, 164 వన్డేలు, 15 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. పాక్ బౌలింగ్ గ్రేట్స్ వసీం అక్రమ్, వకార్ యూనిస్‌లతో అక్తర్ కలిసి ఆడటం విశేషం.

Story first published: Monday, October 8, 2018, 15:26 [IST]
Other articles published on Oct 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X