న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీని కాపీ కొట్టడం అంటే ఫొటోలు దిగడం కాదు.. పరుగులు చేయాలి!!

Shirtless photo: Mohammad Hafeez trolled by fans, If you want to copy Virat Kohli perform like him

హైదరాబాద్: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్‌ మహ్మద్‌ హఫీజ్‌పై ఆ దేశ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని కాపీ కొట్టడం అంటే అతడిలా ఫొటోలు దిగడం కాదు, పరుగులు చేయాలని చురకలంటించారు. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ చెత్త ప్రదర్శనతో సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. హఫీజ్‌ ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా అతని అనుభవం చూపలేకపోయాడు.

బుమ్రా ప్రత్యేక ప్రతిభావంతుడు.. సంక్లిష్టమైన బౌలింగ్‌ శైలే అతడికి వరంబుమ్రా ప్రత్యేక ప్రతిభావంతుడు.. సంక్లిష్టమైన బౌలింగ్‌ శైలే అతడికి వరం

కరేబియన్‌ లీగ్‌లో:

కరేబియన్‌ లీగ్‌లో:

కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న హఫీజ్‌ను ప్రధాన కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌ మిస్బా ఉల్ హక్ శ్రీలంక సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ప్రపంచకప్‌లో కూడా చెత్త ప్రదర్శన కనబరచడంతో మేజర్‌ కాంట్రాక్టుల విషయంలో కూడా అతడిని పీసీబీ పక్కన పెట్టింది. ఇక చేసేదేంలేక హఫీజ్‌ప్రస్తుతం కరేబియన్‌ లీగ్‌లో ఆడుతున్నాడు. సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌ తరఫున హఫీజ్‌ మైదానంలోకి దిగుతున్నాడు.

ఫొటోలు దిగడం కాదు.. పరుగులు చేయాలి:

టోర్నీలో భాగంగా హఫీజ్‌ బస చేస్తున్న హోటల్‌లోని స్మిమ్మింగ్‌పూల్‌లో ఫొటోలు దిగాడు. ఈ పోటోలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. 'సెయింట్‌ లూయీస్‌ వద్ద అందమైన సూర్యాస్తమయం' అని రాసుకోచ్చాడు. అయితే కోహ్లీ లాగా హఫీజ్‌ కూడా 'షర్ట్‌లెస్‌' షో చేయడంతో.. నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. 'కోహ్లీని కాపీ కొట్టడం అంటే అతడిలా ఫొటోలు దిగడం కాదు, పరుగులు చేయాలి' అని ఓ నెటిజన్ మండిపడ్డాడు. 'జట్టు నుంచి తప్పించారన్న బాధే లేదు'.. 'రిటైర్మెంట్‌ తీసుకుని లీగ్‌ మ్యాచ్‌లు ఆడుకో' అని రకరకాలుగా ట్రోల్‌ చేస్తున్నారు.

హఫీజ్‌కు మొండిచేయి:

హఫీజ్‌కు మొండిచేయి:

త్వరలో శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) 16 మంది సభ్యులతో కూడిన జట్టును శనివారం ప్రకటించింది. మిస్బా నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ జట్టులో పలు మార్పులు చేసింది. ఈ సిరీస్ కోసం పాక్‌ జట్టులోకి ఐదుగురు కొత్త వాళ్లకి అవకాశం కల్పించాడు. ఇక సీనియర్‌ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, మహ్మద్‌ హఫీజ్‌లను జట్టులో చోటు ఇవ్వలేదు. అయితే పేలవ ఫామ్‌లో ఉన్న స్టార్ పేసర్ మహ్మద్‌ అమిర్‌ను ఎంపిక చేశారు. కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ అహ్మద్‌పై నమ్మకం ఉంచి అతన్నే కొనసాగించారు. ఇక వైస్‌ కెప్టెన్‌గా బాబర్‌ అజమ్‌ ఉన్నాడు.

27న మొదటి వన్డే:

27న మొదటి వన్డే:

ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ చెత్త ప్రదర్శన చేయడంతో మిస్బా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే పాక్ ఆటగాళ్లు బిర్యానీ, స్పైసీ ఫుడ్, స్వీట్లకు దూరంగా ఉండాలని ఇప్పటికే మిస్బా ఆదేశాలు జారీ చేశాడు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. శ్రీలంకతో ఈ నెల 27 నుంచి స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. మొదటి వన్డే సెప్టెంబర్ 27న జరుగుతుంది. ఈ సిరీస్ కోసం లంక జట్టులోని 10 మంది ఆటగాళ్లు నిరాకరించిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, September 24, 2019, 12:19 [IST]
Other articles published on Sep 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X