న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రేయస్‌ అయ్యర్‌ స్టన్నింగ్ ఫీల్డింగ్.. హెట్‌మెయిర్‌ రనౌట్ (వీడియో)!!

Shimron Hetmyer Becomes Victim Of Shreyas Iyers Sensational Fielding Effort

విశాఖ: వన్డే సిరీస్‌లో చెన్నై మ్యాచ్‌ ఓటమి నుంచి భారత్‌ వెంటనే కోలుకుంది. బుధవారం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 107 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంలో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రోహిత్‌ శర్మ (138 బంతుల్లో 159; 17 ఫోర్లు, 5 సిక్సర్లు), లోకేశ్‌ రాహుల్‌ (104 బంతుల్లో 102; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కుల్దీప్‌ యాదవ్‌ (3/52), మొహమ్మద్ షమీ (3/39)లు కీలక పాత్ర పోషించారు.

ఎంతో ఒత్తిడిలో హ్యాట్రిక్‌ తీసా.. కెరీర్‌లో ఇదే నా బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌: కుల్దీప్‌ఎంతో ఒత్తిడిలో హ్యాట్రిక్‌ తీసా.. కెరీర్‌లో ఇదే నా బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌: కుల్దీప్‌

అయ్యర్‌ కీలక పాత్ర:

అయ్యర్‌ కీలక పాత్ర:

భారత్‌ విజయంలో యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా కీలక భూమిక పోషించాడు. అయ్యర్‌ (32 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాట్‌తో రాణించడమే కాక.. స్టన్నింగ్ ఫీల్డింగ్ కూడా చేసాడు. చెన్నై మ్యాచ్‌లో తన పవర్ హిట్టింగ్‌తో విండీస్‌ను విజయతీరాలకు చేర్చిన షిమ్రాన్ హెట్‌మెయిర్‌ను శ్రేయస్‌ తన అద్భుత ఫీల్డింగ్ విన్యాసంతో తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చాడు.

స్టన్నింగ్ ఫీల్డింగ్:

స్టన్నింగ్ ఫీల్డింగ్:

388 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఓపెనర్ లెవిస్ ఔటయిన అనంతరం క్రీజులోకి వచ్చిన హెట్‌మెయిర్‌.. 13వ ఓవర్ మొదటి బంతికి లాంగ్ ఆన్ దిశగా షాట్ ఆడాడు. బాల్‌ను బౌండరీకి వెళ్లకుండా అయ్యర్ అద్భుతంగా ఛేజ్ చేసి బంతిని ఆపాడు. వెంటనే బౌలర్ జడేజాకు విసిరాడు. జడేజా రెప్పపాటులో బంతితో వికెట్లను గిరాటేశాడు. దీంతో హెట్‌మెయిర్‌ పెవిలియన్ చేరాడు. అప్పటికే 2 పరుగులు తీసిన హెట్‌మెయిర్‌.. అనవసర పరుగు కోసం ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు.

 హాఫ్ సెంచరీ సంబరాలు:

హాఫ్ సెంచరీ సంబరాలు:

విశాఖలో అయ్యర్‌ వన్డేల్లో ఆరవ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే 49 పరుగుల వద్ద ఉన్నపుడే హాఫ్ సెంచరీ అయిందనుకుని అయ్యర్‌ సంబరాలు చేసుకున్నాడు. విండీస్ బౌలర్ కీమో పాల్ వేసిన 48వ ఓవర్ రెండో బంతికి అయ్యర్‌ షాట్ ఆడి సింగల్ పూర్తి చేసాడు. అప్పుడు అయ్యర్ 27 బంతుల్లో 49 పరుగులతో ఉన్నాడు. సింగల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తయిందనుకున్న అయ్యర్.. సహచర ఆటగాడు రిషభ్‌ పంత్‌తో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఇది అందరిని ఆకట్టుకుంది. అనంతరం హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు.

సచిన్‌-జడేజా రికార్డు బద్దలు:

రోస్టన్‌ ఛేజ్‌ వేసిన 47వ ఓవర్‌లో అయ్యర్‌ 6, 6, 4, 6, 6 బాదడంతో మైదానం నలువైపులా మోత మోగిపోయింది. ఈ ఓవర్‌లో మొత్తంగా 31 పరుగులు వచ్చాయి. వన్డేల్లో ఒక ఓవర్‌లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు (31). దీంతో 20 ఏళ్ల క్రితం సచిన్‌ టెండూల్కర్-అజయ్‌ జడేజా (28 పరుగులు) నెలకొల్పిన రికార్డు బద్దలయింది.

Story first published: Thursday, December 19, 2019, 15:58 [IST]
Other articles published on Dec 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X