న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధావన్ గాయపడినా... మరో ఆటగాడిని ఎందుకు తీసుకోలేదంటే!

ICC Cricket World Cup 2019 : Dhawan To Stay With Team In ICC World Cup 2019 Despite Injury
Shikhar Dhawan to stay with team in ICC World Cup 2019 despite injury

హైదరాబాద్: వరుస విజయాలతో జోరు మీదున్న భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ శిఖర్ ధావన్‌కు జట్టు యాజమాన్యం మంగళవారం స్కానింగ్‌ చేయించింది. దీంతో అతడి వేలి ఎముక చిట్లినట్టు తేలింది. గాయం తీవ్రత దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో అతడు సుమారు మూడు వారాల పాటు టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. తాజాగా ధావన్‌ గాయం తీవ్రతపై బీసీసీఐ స్పందించింది. ధావన్ ఇంగ్లాండ్‌లోనే ఉండేందుకు మెడికల్ టీమ్ అనుమతిచ్చిందని బీసీసీఐ తెలిపింది. అంతేకాదు అతడిని ఇంగ్లాండ్‌లోనే ఉంచి చికిత్స అందించాలని బీసీసీఐ నిర్ణయించింది.

మెడికల్‌ టీమ్ పర్యవేక్షణలో ధావన్

ధావన్‌ జట్టుతో పాటు మెడికల్‌ టీమ్ పర్యవేక్షణలో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ ధావన్ గాయాన్ని పరిశీలిస్తున్నారని.. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కి మాత్రం అతడు దూరం కానున్నట్లు బీసీసీఐ తన ట్విట్టర్‌లో పేర్కొంది. అతడి స్థానంలో వేరొక ఆటగాడిని బీసీసీఐ ఎంపిక చేయలేదు.

ఐసీసీ నిబంధన ప్రకారం

ఐసీసీ నిబంధన ప్రకారం

ఐసీసీ నిబంధన ప్రకారం గాయపడ్డ ఆటగాడి స్థానంలో మరొకరిని తీసుకుంటే.. ఆ ఆటగాడు మళ్లీ కోలుకున్నప్పటికీ అతడిని జట్టులోకి తిరిగి రావడానికి వీల్లేదు. గాయపడ్డ ఆటగాడి స్థానంలో ఎంపికైన ఆటగాడిని తప్పించి, పాత ఆటగాడిని ఎంచుకోవడానికి ఐసీసీ నిబంధనలు ఒప్పుకోవు.

ఎన్ని రోజులు ఆటకు దూరం

ఎన్ని రోజులు ఆటకు దూరం

నిజానికి ధావన్ ఎన్ని రోజులు ఆటకు దూరమవుతాడన్న విషయంలో బీసీసీఐకి కూడా స్పష్టత లేదు. కనీసం మూడు మ్యాచ్‌లకు ధావన్ దూరమవుతాడని వైద్యులు అంచనా వేస్తున్నారు. టోర్నీలో భాగంగా గురువారం న్యూజిలాండ్‌తో, ఆదివారం పాకిస్థాన్‌తో, జూన్ 22న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది.

ధావన్‌కు మూడు వారాల విశ్రాంతి

ధావన్‌కు మూడు వారాల విశ్రాంతి

ధావన్‌కు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు కాబట్టి ఈ మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత జూన్ 27న వెస్టిండీస్‌తో, 30న ఇంగ్లాండ్‌తో కోహ్లీసేన తలపడనుంది. ఇవి ఎంతో కీలక మ్యాచ్‌లు కావడంతో ఆ సయమానికి ధావన్ కోలుకుంటే అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచన.

ధావన్ గనుక కోలుకోని పక్షంలో

ధావన్ గనుక కోలుకోని పక్షంలో

ఈ మూడు వారాల్లో ధావన్ గనుక కోలుకోని పక్షంలో రిషబ్‌ పంత్‌ను అతడి స్థానంలో ఎంపిక చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌ను ముందు జాగ్రత్తగా ఇంగ్లాండ్‌కు పిలిపించే అవకాశం ఉంది. ధావన్‌ కోలుకునే అవకాశం లేదని తెలిసినా లేదా టోర్నీలో మరో ఆటగాడు గాయపడితే వెంటనే పంత్‌ను తుది జట్టులోకి తీసుకుంటారు.

ఓపెనర్‌గా కేఎల్ రాహుల్

ఓపెనర్‌గా కేఎల్ రాహుల్

గాయం కారణంగా ధావన్ దూరం కావడంతో ఆతడి స్థానాన్ని కేఎల్ రాహుల్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక, గురువారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో నాలుగో స్థానంపై కూడా స్పష్టత రానుంది. నాలుగో స్థానంలో ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ రేసులో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందో చూడాలి మరి.

Story first published: Wednesday, June 12, 2019, 13:24 [IST]
Other articles published on Jun 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X