న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Wasim Jaffer: ఆమె బాగా తెలివైంది.. అందుకే ఆర్సీబీ అభిమానికి ప్రపోజ్ చేసింది

She is Smart girl Thats Why she choose to propose to a ‘loyal’ RCB fan: Wasim Jaffer

పూణెలోని ఎంసీఏ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన నిన్నటి మ్యాచ్‌లో ఓ ఆసక్తికర విషయం జరిగింది. ఆర్సీబీ ఫ్యాన్ అయిన ఓ గర్ల్ మోకాళ్లపైకి కూర్చుని తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. ఆ ప్రపోజల్‌ను అతను యాక్సెప్ట్ చేశాడు. ప్రియుడికి ప్రపోజ్ చేస్తుండగా బిగ్ స్క్రీన్‌లో కన్పించింది. ఈ ఘటనపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ బుధవారం హాస్యభరితంగా స్పందించాడు. ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 174పరుగులు ఛేజింగ్ చేయలేక ఆర్సీబీ చేతిలో 13పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఈ విషయం గ్రౌండ్లోని బిగ్ స్క్రీన్ మీద కన్పించడంతో స్టేడియంలోని అభిమానులు, గ్రౌండ్లోని క్రికెటర్లు కూడా ఆసక్తిగా చూశారు. స్టాండ్స్‌లో ఉన్న ఆర్సీబీ అభిమానుల బృందం ఈ ఉత్సాహభరితమైన క్షణంలో చీర్స్, చప్పట్లతో హుషారుగా ఆ జంటను అభినందించగా.. ప్రియుడు ఆమె ప్రతిపాదనకు 'అవును' అంటూ యాక్సెప్ట్ చేశాడు. ఇక ఆ అమ్మాయి గురించి వసీం జాఫర్ స్పందిస్తూ.. ఒక తెలివైన ఎత్తుగడతో ఆమె ప్రియుడికి ప్రపోజ్ చేసిందని జాఫర్ అన్నాడు. ఆర్సీబీ ఫ్యాన్ అయిన తన ప్రియుడు.. ఎంత వరకు లోయల్టీతో ఉన్నాడో పరీక్షించి ప్రపోజ్ చేసిందంటూ పేర్కొన్నాడు.

ఆమె ఒక తెలివైన అమ్మాయి.. ఆర్సీబీ ఫ్యాన్ అయిన తన ప్రియుడికి తెలివిగా ప్రపోజ్ చేసింది. ఇన్నేళ్లుగా ఆర్సీబీగా లోయల్‌గా ఉన్నట్లు గమనించిన ఆ గర్ల్.. తన లవ్ పట్ల కూడా అంతే లోయల్‌గా ఉంటాడని భావించి అతనికి ప్రపోజ్ చేసిందంటూ జాఫర్ పేర్కొన్నాడు. అతను ఆర్సీబీకి విధేయుడిగా ఉండగలిగితే అతను కచ్చితంగా తన భాగస్వామికి విధేయుడిగా ఉండగలడు అని ఆమె భావించిందంటూ జాఫర్ ట్వీట్ చేశాడు. ట్వీట్లో ఈ మేరకు ఆమె ప్రపోజ్ చేస్తున్న పిక్‌ను కూడా పోస్ట్ చేశాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఒక్క సారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవకపోయినప్పటికీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధికంగా అనుసరించే ఫ్రాంచైజీలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఒకటి. ఆర్సీబీ కోసం ప్రతి ఏటా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద అభిమానులు భారీఎత్తున హాజరవుతూనే ఉంటారు. టైటిల్‌తో సంబంధం లేకుండా ఆర్సీబీ పట్ల అభిమానులు తమ విధేయతను చాటుతూనే ఉంటారు.

Story first published: Thursday, May 5, 2022, 14:43 [IST]
Other articles published on May 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X