న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs West Indies: వన్డే సిరిస్‌కు ముందు షాక్, భువీ స్థానంలో శార్దుల్‌ ఠాకూర్‌

India VS West Indies 1st ODI : Shardul Thakur Replaces Bhuvneshwar For West Indies ODIs || Oneindia
 India vs West Indies: Shardul Thakur Replaces Injured Bhuvneshwar Kumar For ODI Series Against West Indies

హైదరాబాద్: ఆదివారం నుంచి వెస్టిండిస్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరిస్‌కు ప్రకటించిన భారత జట్టులో బీసీసీఐ మార్పులు చేసింది. టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మరోసారి గాయం బారిన పడ్డాడు. వరల్డ్‌కప్ తర్వాత మోకాలి గాయం కారణంగా క్రికెట్‌కు నాలుగు నెలలు దూరమైన భువనేశ్వర్ ఇటీవలే విండిస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఇరు జట్ల మధ్య చెన్నై వేదికగా తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌ కోసం టీమిండియా నెట్ ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది. అయితే, నెట్‌ ప్రాక్టీస్‌లో భాగంగా భువీకి గాయం తిరగబెట్టినట్టు తెలుస్తోంది. దీంతో గాయం కారణంగా వెస్టిండిస్‌తో మూడు వన్డేల సిరిస్‌కు భువనేశ్వర్‌ కుమార్ దూరమయ్యాడు.

భారత జట్టులో చేర్చుకుంటావా?: చిన్నారి బ్యాటింగ్‌కు కోహ్లీ ఫిదా (వీడియో)భారత జట్టులో చేర్చుకుంటావా?: చిన్నారి బ్యాటింగ్‌కు కోహ్లీ ఫిదా (వీడియో)

భువీ స్థానంలో శార్దుల్‌ ఠాకూర్‌

భువీ స్థానంలో శార్దుల్‌ ఠాకూర్‌

అతడి స్థానంలో శార్దుల్‌ ఠాకూర్‌ జట్టులో చోటు సాధించినట్లు శనివారం బీసీసీఐ పేర్కొంది. భువీ గాయంపై బౌలింగ్‌ కోచ్‌ అరుణ్‌ అరుణ్ మాట్లాడుతూ "భువీ గాయంపై ఫిజియో పరీక్షలు నిర్వహిస్తున్నాడని, నివేదిక రాగానే అతడి గాయంపై స్పష్టత వస్తుంది" అని పేర్కొన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఆదివారం చెన్నై వేదికగా జరగనుంది.

చివరగా 2018లో

చివరగా 2018లో

భువీ స్థానంలో ఉమేశ్‌ను ఎంపిక చేస్తారని భావించినప్పటికీ శార్దూల్‌ వైపై బీసీసీఐ మొగ్గు చూపింది. శార్దుల్‌ ఠాకూర్‌ చివరగా 2018లో ఆడాడు. అనంతరం గాయం కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

విండిస్‌తో మూడు వన్డేల సిరిస్‌కు జట్టు :

విండిస్‌తో మూడు వన్డేల సిరిస్‌కు జట్టు :

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషభ్‌పంత్‌(వికెట్‌ కీపర్‌), శివం దూబే, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్‌, కులదీప్‌ యాదవ్‌, దీపక్‌ చాహర్‌, మహమ్మద్‌ షమీ, శార్దుల్‌ ఠాకూర్‌

Story first published: Saturday, December 14, 2019, 11:37 [IST]
Other articles published on Dec 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X