న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు: ఆల్‌టైమ్ రికార్డు ధర పలికిన షేన్ వార్న్ 'బ్యాగీ గ్రీన్'

Shane Warnes Baggy Green becomes most valuable of all time, surpasses Bradmans Cap, Dhonis bat

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితుల‌కు విరాళాం ఇచ్చేందుకు ఆ దేశ దిగ్గజ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ తన బ్యాగీ గ్రీన్‌(ఆస్ట్రేలియా క్రికెటర్లు ధరించే క్యాప్‌)ను వేలానికి పెట్టగా అది ఆల్‌టైమ్‌ రికార్డు ధర పలికింది. తన బ్యాగీ గ్రీన్‌ క్యాప్‌ను సోమవారం వేలంలో ఉంచగా... అది రోజు వ్యవధిలోనే ఊహించని ధరకు అమ్ముడుపోయింది.

కార్చిచ్చులో 24మందికి పైగా ప్రాణాలు కోల్పోగా... లక్షలాది వన్యప్రాణులను మంటల్లో దగ్ధం చేసింది. ఈ నేపథ్యంలో కార్చిచ్చు బాధితుల‌కు విరాళాం ఇచ్చేందుకు షేన్ వార్న్ తన బ్యాగీ గ్రీన్‌ను వేలానికి ఉంచగా దానిని సిడ్నీకి చెందిన ఓ వ్యక్తి 5,29,500 డాలర్లకు సొంతం చేసుకున్నాడు. ఫలితంగా అత్యంత ధర పలికిన ఓ 'క్రికెట్‌ జ్ఞాపకం'గా వార్న్‌ బ్యాగీ గ్రీన్‌ రికార్డు నెలకొల్పింది.

<strong>'ధోనీ స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేను.. కనీసం ఆ ఆలోచనల జోలికే పోను'</strong>'ధోనీ స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేను.. కనీసం ఆ ఆలోచనల జోలికే పోను'

సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ రికార్డు బద్దలు

సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ రికార్డు బద్దలు

ఈ క్రమంలో ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ బ్యాగీ గ్రీన్‌ను అధిగమించింది. గతంలో డాన్ బ్రాడ్‌మన్‌ బ్యాగీ గ్రీన్‌ను వేలం పెట్టగా అది 4,25,00 డాలర్లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు ఆ రికార్డుని వార్న్ గ్రీన్ బ్యాగీ అధిగమించింది. ఇక, ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ మూడో స్థానంలో నిలిచింది.

మూడో స్థానంలో ధోని బ్యాట్

మూడో స్థానంలో ధోని బ్యాట్

2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ధోని ఆడిన బ్యాట్‌ను తర్వాత వేలంగా వేయగా దాని విలువ సుమారు రూ.కోటి పలికింది. షేన్ వార్న్ తన గ్రీన్ బ్యాగీని వేలానికి ఉంచిన రెండు గంటల వ్యవధిలో అది 2,75,000 డాలర్లను దాటింది. చివరకు వేలంలో వార్న్ గ్రీన్ బ్యాగీని ఎంసీ అనే వ్యక్తి దాన్ని రికార్డు ధరకు సొంతం చేసుకున్నాడు.

అడవుల్లో రగిలిన కార్చిచ్చు

అడవుల్లో రగిలిన కార్చిచ్చు

ఆస్ట్రేలియాలోని అడవుల్లో రగిలిన కార్చిచ్చు అంద‌ర్నీ నిరాశ‌కు లోను చేసింద‌ని... దావాన‌లం వ‌ల్ల వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారని షేన్ వార్న్ చెప్పుకొచ్చాడు. సుమారు 50 కోట్ల‌ జంతువులు చ‌నిపోయిన‌ట్లు చెప్పాడు. దీంతో కార్చిచ్చు బాధితులను ఆదుకునేందుకు టెస్టు కెరీర్‌ ఆసాంతం ధరించిన బ్యాగీ గ్రీన్‌ టోపీని వేలం వేస్తున్నట్లు ప్రకటించాడు.

ప్రతి ఒక్కరు నిధుల సేకరణలో భాగం కావాలి

ప్రతి ఒక్కరు నిధుల సేకరణలో భాగం కావాలి

ప్రతి ఒక్కరు నిధుల సేకరణలో భాగం కావాలని షేన్ వార్న్‌ పిలుపునిచ్చాడు. మరోవైపు కార్చిచ్చు బాధితులకు సాయం చేసేందుకు సామాన్యులతో పాటు సెలబ్రెటీల సైతం తమ వంతుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అడవుల్లోని మంటలను అదుపు చేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం 3,000 మంది సైనికులను రంగంలో దింపింది.

టెన్నిస్ ఆటగాళ్ళు సైతం నిధులు

టెన్నిస్ ఆటగాళ్ళు సైతం నిధులు

న్యూసౌత్ వేల్స్. న్యూ సౌత్‌‌ వేల్స్‌, విక్టోరియా రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. దాదాపు 60 లక్షల హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. న్యూసౌత్‌ వేల్స్‌లో 40 లక్షల హెక్టార్లు, విక్టోరియాలో 8 లక్షల హెక్టార్లలో చెట్లు, పంటలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు ఈ టోర్నీ కోసం దేశానికి వచ్చిన పలువురు అంతర్జాతీయ టెన్నిస్ ఆటగాళ్ళు సైతం నిధులు సేకరించారు.

Story first published: Thursday, January 9, 2020, 15:55 [IST]
Other articles published on Jan 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X