న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పలు రికార్డులు బద్దలు: ఈ ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరిస్‌ షకీబ్‌కేనా?

ICC Cricket World Cup 2019 : Shakib Al Hasan Will Become The Man Of The Series Of World Cup 2019
Shakib Al Hasan: Has he already become the man of the series of WC 2019?

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టు ఎంతో అనుభవం ఉన్న జట్టులా ఆడుతోంది. ప్రస్తుతం ఉన్న బంగ్లా జట్టులో అనేక మంది ఆటగాళ్లు నాలుగో సారి ప్రపంచకప్‌ను ఆడుతున్నారు. ఈ జాబితాలో షకీబ్ ఉల్ హాసన్ ఒకడు. 32 ఏళ్ల షకీబ్ ఉల్ హాసన్ ప్రస్తుతం నాలుగో ప్రపంచకప్‌ను ఆడుతున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ ప్రపంచకప్‌లో షకీబ్ అటు బ్యాట్‌తోనూ ఇటు బంతితోనూ అద్బుత ప్రదర్శన చేస్తున్నాడు. ప్రపంచకప్‌ చరిత్రలోనే మరే ఆల్‌రౌండర్‌కూ సాధ్యం కాని విధంగా అతడి ప్రదర్శన ఉంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లోనే షకీబ్ 476 పరుగులు చేయడం విశేషం. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

దీంతో పాటు 10 వికెట్లు తీసుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ సాధించిన మూడు విజయాల్లోనూ షకీబ్‌కే 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. టోర్నీలో భాగంగా సోమవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన షకీబ్ ఉల్ హాసన్... వార్నర్‌ (447)ను అధిగమించి టోర్నీ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.

1996 వరల్డ్‌కప్: జయసూర్య రికార్డుని సమం చేసిన షకీబ్

1996 వరల్డ్‌కప్: జయసూర్య రికార్డుని సమం చేసిన షకీబ్

ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‍‌లో షకీబ్ రికార్డుల మీద రికార్డుల నెలకొల్పాడు. మొత్తం 27 వరల్డ్‌కప్ మ్యాచ్‌లాడిన షకీబ్ 33 వికెట్లు తీయడంతో పాటు 1016 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య(1165 పరుగులు, 25 వికెట్లు) వికెట్ల రికార్డుని అధిగమించాడు. 1996 వన్డే వరల్డ్‌కప్‌లో జయసూర్య ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డుని కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో షకీబ్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు వరించనుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మూడో ఆటగాడు

ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మూడో ఆటగాడు

ఈ ప్రపంచకప్‌లో షకీబ్ ప్రపంచకప్‌లో సెంచరీ, ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు కపిల్‌ దేవ్(1983), యువరాజ్‌ సింగ్(2011) ఈ జాబితాలో ముందున్నారు. 2011 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించాడు. ఇక, ఒక ప్రపంచకప్‌ మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టడంతో పాటు హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్లు యువరాజ్‌ (2015), షకిబ్‌ (2019) మాత్రమే కావడం విశేషం.

No.3 స్థానంలో షకీబ్‌ను ప్రమోట్ చేసిన బంగ్లా బోర్డు

No.3 స్థానంలో షకీబ్‌ను ప్రమోట్ చేసిన బంగ్లా బోర్డు

ఈ ప్రపంచకప్‌లో షకీబ్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో No.3 స్థానంలో ప్రమోట్ చేసిన బంగ్లా జట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న అద్భుత నిర్ణయమని కొనియాడుతున్నారు. నిజానికి ఆల్‌రౌండర్ అయిన షకీబ్‌ను టాపార్డర్‌లోకి ప్రమోట్ చేయడం అంత సులువైన విషయం కాదు. అది ఆసియాకు చెందిన క్రికెటర్ ఆ జట్టు కోచ్ ఉండి. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు కోచ్‌గా శ్రీలంక మాజీ క్రికెటర్ చంద్రిక హతురసింగ ఉన్నారు. అయితే, తనకు అందివచ్చిన అవకాశాన్ని షకీబ్ చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. సాధారణంగా No.5 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే షకీబ్ 125 మ్యాచ్‌ల్లో 3,852 పరుగులు చేశాడు. యావరేజి 58గా ఉంది. అదే No.3 స్థానంలో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడిన షకీబ్ 1,047 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో షకీబ్ చేసిన రెండు సెంచరీలు కూడా No.3 స్థానంలో దిగి చేసినవే కావడం విశేషం.

క్రికెటర్లను టాపార్డర్‌లో ప్రమోట్ చేయడం కొత్త కాదు

క్రికెటర్లను టాపార్డర్‌లో ప్రమోట్ చేయడం కొత్త కాదు

ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో క్రికెటర్లను టాపార్టర్‌లో ప్రమోట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1992 వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ క్రికెటర్‌ మార్క్ గ్రేట్‌బ్యాచ్‌ను ఓపెనర్‌గా ఆ జట్టు మేనేజ్‌మెంట్ బరిలోకి దింపింది. దీంతో ఆ వరల్డ్‌కప్‌లో మార్క్ గ్రేట్‌బ్యాచ్‌ ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆ జట్టుకు అందించాడు. ఇదే, ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు మేనేజ్‌మెంట్ కూడా కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌ను సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లో No.3 స్థానంలో బరిలోకి దింపింది. ఈ మార్పు పాకిస్థాన్‌కు ప్రపంచకప్‌ను తెచ్చిపెట్టింది.

Story first published: Tuesday, June 25, 2019, 13:48 [IST]
Other articles published on Jun 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X