న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంక సిరీస్‌తోనే షకీబుల్‌ హసన్‌ రీఎంట్రీ!!

Shakib Al Hasan could make international comeback with Sri Lanka series

కొలొంబో: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌‌ హసన్‌ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ ఏడాది చివరలో జరగనున్న శ్రీలంక పర్యటనలో షకీబుల్‌‌ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించే అవకాశం ఉంది. షకిబ్‌తో బుకీలు సంప్రదింపులు జరిపినా ఆ విషయాన్ని ఐసీసీకి వెల్లడించకపోవడంతో.. అతనిపై రెండేళ్లు నిషేధం విధించింది. అయితే షకీబుల్‌‌ తన తప్పు అంగీకరించడంతో ఏడాది మినహాయింపు లభించింది. వచ్చే అక్టోబర్ 29తో అతని సస్పెన్షన్ ముగియనుంది.

బంగ్లాదేశ్-శ్రీలంక పర్యటన ఖరారు అయినా.. అధికారికంగా మాత్రం ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ జరగనుంది. ఈ టీ20 సిరీస్‌లోనే షకీబుల్‌ హసన్‌ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. 'షకీబ్ ఒక సంవత్సరం పాటు జట్టుకు దూరమవడం భిన్నంగా ఏమీ లేదు' అని బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ రస్సెల్ డొమింగో పేర్కొన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో షకీబుల్‌ ఇప్పటివరకు 56 టెస్టుల్లో, 206 వన్డేల్లో, 76 టీ20 మ్యాచ్‌ల్లో బంగ్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

'ఎలాంటి క్రికెట్ ఆడకుండా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావడం చాలా కష్టం. షకీబుల్‌కు కొన్ని అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అతను ప్రపంచ స్థాయి ఆటగాడు కాబట్టి తిరిగి గాడిలో పడతాడని నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ ఫిట్‌నెస్‌ ముఖ్యమైన విషయం' అని రస్సెల్ డొమింగో అన్నాడు. షకీబ్ జాతీయ జట్టులోకి రాకముందే సస్పెండ్ చేయబడిన క్రికెటర్‌గా అనధికారిక క్రికెట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని డొమింగో తెలిపారు. శ్రీలంక పర్యటన ఖరారు అయిన తర్వాత అన్ని ఆలోచిస్తాం అని చెప్పాడు. సెప్టెంబర్ 24న లంకకు బంగ్లా వెళ్లనుందని సమాచారం. టీ20 సిరీస్‌తో పాటు మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కూడా నిర్వహించాలని ఇరు బోర్డులు చర్చలు జరపుతున్నాయని తెలుస్తోంది.

షకీబుల్‌ అక్టోబర్ 2019 నుండి క్రికెట్ ఆడలేదు. 2018 జనవరిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా షకీబుల్‌ను బుకీలు సంప్రదించారు. ఈ విషయం ఐసీసీకి వెల్లడించడంలో విఫలమైనందుకు ఆర్టికల్‌ 2.4.4 ప్రకారం రెండు అభియోగాలు నమోదయ్యాయి. ఇక 2018 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా బుకీలు సంప్రదించారు. ఆ విషయాన్ని కూడా వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం జరిపిన విచారణలో షకీబుల్‌ తన తప్పులను ఒప్పుకున్నాడు. తప్పు అంగీకరించడంతో ఐసీసీ శిక్ష విధించింది.

33 ఏళ్ల షకీబుల్‌‌ హసన్‌ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి అమెరికాలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న షకీబుల్.. ఆగస్టు చివరిలో ఢాకాకు తిరిగి రావాలని చూస్తున్నాడు. నిషేధానికి ముందు షకీబుల్‌‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. యూకేలో జరిగిన 2019 ప్రపంచ కప్‌లో 606 పరుగులు చేసాడు.

కెరీర్‌ గురించి ఆందోళన.. ఆత్మహత్య చేసుకున్న క్రికెటర్!!కెరీర్‌ గురించి ఆందోళన.. ఆత్మహత్య చేసుకున్న క్రికెటర్!!

Story first published: Wednesday, August 12, 2020, 19:32 [IST]
Other articles published on Aug 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X