న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైరల్ వీడియో.. అద్భుతమైన ఫుట్ వర్క్‌తో ఏడేళ్ల చిన్నారి బ్యాటింగ్!!

Shai Hope and Michael Vaughan were impressed by the batting technique of seven-year-old Pari Sharma

ఢిల్లీ: సోషల్ మీడియా పుణ్యమాని నిత్యం ఎన్నో వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక టిక్‌టాక్ వచ్చిన తర్వాత వీడియో కంటెంట్ ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఇప్పటికే పలు వీడియోలు పాపులర్ అయ్యాయి. ఇలాంటి వాటిల్లో భారత్‌కు చెందిన పరీ శర్మ అనే ఏడేళ్ల చిన్నారి బ్యాటింగ్ వీడియో కూడా ఉంది. పరీ శర్మ బ్యాటింగ్ చూసి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్ ఫిదా అయ్యారు. అంత చిన్న వయస్సులోనే అద్భుతమైన ఫుట్ వర్క్‌తో పరీ బ్యాటింగ్ చేస్తున్న తీరు వాళ్లని మంత్రముగ్ధుల్ని చేసింది.

కష్టాల్లో క్రికెట్ ఆస్ట్రేలియా.. సూపర్‌ మార్కెట్‌లో ఉద్యోగాలు!!కష్టాల్లో క్రికెట్ ఆస్ట్రేలియా.. సూపర్‌ మార్కెట్‌లో ఉద్యోగాలు!!

చిన్నారి పరీ బ్యాటింగ్ చేస్తున్న వీడియోని మైఖేల్ వాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'ఈ వీడియోని ఒకసారి చూడండి. 7 సంవత్సరాల పరీ శర్మ.. బ్యాటింగ్ చేస్తున్న తీరు ఎంతో అద్భుతంగా ఉంది' అని వాన్ పేర్కొన్నాడు. ఇక వెస్టిండీస్ ఆటగాడు షాయ్ హోప్ కూడా పరీ వీడియోని షేర్ చేసి.. 'నేను ఎదిగాక పరీ శర్మలా ఉండాలనుకుంటున్నా' అని క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

పరీ శర్మ బ్యాటింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా మహిళ జట్టు స్టార్ పేసర్ శిఖా పాండే కంటపడింది. శిఖా కూడా ఈ వీడియోపై స్పందించింది. 'పరీ ఎక్కడ ఉన్నా.. ఆమెను కలుసుకుంటా. ఆమె నుంచి శిక్షణ పొందాలని నాకు ఉంది' అని శిఖా పాండే పేర్కొంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అంత చిన్న వయస్సులోనే పరీ.. టైమింగ్, ఫుట్‌వర్క్, నేర్పుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇటీవల మైఖేల్ వాన్ ఓ బుడ్డోడి వీడియోను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్లాస్టిక్‌ బ్యాట్‌ పట్టిన ఓ చిన్నారి స్ట్రైట్‌ డ్రైవ్‌లు, కవర్‌ డ్రైవ్‌లు ఆడుతున్న వీడియోని‌ వాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ట్యాగ్‌ చేశాడు. 'అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన కలిగిన ఆ బుడ్డోడిని టీమిండియా కెప్టెన్‌ భారత జట్టులో చేర్చుకుంటాడా?' అని కామెంట్ పెట్టాడు. ఈ వీడియోని చూసిన కోహ్లీ ఆ చిన్నారి బ్యాటింగ్‌కు ముగ్థుడయ్యాడు.

Story first published: Wednesday, April 22, 2020, 16:31 [IST]
Other articles published on Apr 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X