న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ కోసం షెఫాలీకి హెయిర్‌ కట్‌.. అమ్మాయిగా ఎవరూ గుర్తుపట్టలేదు!!

Shafali Verma Was Forced To Trim Hair To Play Cricket, Reveals Father Sanjay Verma

ఢిల్లీ: 15 ఏళ్లకే భారత మహిళా జట్టులో చోటుదక్కించుకుని యువ సంచలనం షెఫాలీ వర్మ రికార్డు సృష్టించింది. మహిళల ఐపీఎల్‌లో దుమ్ముదులపడం, అండర్‌-19, అండర్‌-23 దేశవాళీ క్రికెట్‌లో షెఫాలీ 150కి పైగా స్ట్రయిక్‌ రేట్‌తో వేగంగా పరుగులు చేస్తూ సెలెక్టర్లను ఆకట్టుకుంది. దీంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆరు టీ20ల సిరీస్‌కు ఎంపికైంది. షెఫాలీ వర్మ పేరు ప్రస్తుతం మారుమ్రోగిపోతోంది.

మిథాలీ స్థానంలో అరంగేట్రం:

మిథాలీ స్థానంలో అరంగేట్రం:

భారత మహిళా జట్టు సీనియర్ ప్లేయర్‌ మిథాలీ రాజ్‌ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో.. ఆ స్థానంలో షెఫాలీకి చోటుదక్కింది. అరంగ్రేట మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగినా.. తర్వాతి మ్యాచ్‌లో 46 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన రెండో పిన్న వయస్కురాలిగా రికార్డుకెక్కిన షెఫాలీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే క్రికెట్‌లోకి షెఫాలీ అంత సులువుగా ఏం రాలేదని, అకాడమీలో చేరేందుకు షెఫాలీ అబ్బాయిలా తన వేషధారణ మార్చుకుందని ఆమె తండ్రి సంజీవ్‌ తెలిపారు.

అబ్బాయిలు ఆడనిచ్చేవారు కాదు:

అబ్బాయిలు ఆడనిచ్చేవారు కాదు:

షెఫాలీ తండ్రి సంజీవ్‌ మాట్లాడుతూ... 'ఎనిమిది ఏళ్ల వయసు నుండే ప్రతీ ఆదివారం షెఫాలీని తీసుకుని గ్రౌండ్‌కు తీసుకువెళ్లేవాడిని. మా ప్రాంతంలో మహిళల క్రికెట్ అకాడమీ లేదు. ఉన్న అకాడమీలో ఎక్కువగా అబ్బాయిలే ఉండేవారు. షెఫాలీని వాళ్లతో ఆడనిచ్చేవారు కాదు. ఆడనివ్వమని అడిగితే.. తను అమ్మాయి, గాయాలు అవుతాయి అనేవారు. అవకాశం ఇవ్వమని బతిమలాడినా ఎటువంటి ప్రయోజనం కలగలేదు. దీంతో షెఫాలీ నిరాశ పడేది' అని తెలిపారు.

హెయిర్‌ కట్‌ చేయించి అకాడమీలో చేర్చా:

హెయిర్‌ కట్‌ చేయించి అకాడమీలో చేర్చా:

షెఫాలీ నిరాశను చూసి అప్పుడే నాకో ఆలోచన తట్టింది. షెఫాలీకి అబ్బాయిలా హెయిర్‌ కట్‌ చేయించి అకాడమీలో చేర్చాలని భావించా. తనను బార్బర్‌ షాపునకు తీసుకువెళ్లి అబ్బాయిల్లా హెయిర్‌ కట్‌ చేపించా. ఇక అబ్బాయిల్లాగానే తనను డ్రెస్‌ చేసుకోమని చెప్పా. అలా షెఫాలీ ప్రాక్టీస్‌ కొనసాగింది. తనకి ఏమైనా జరుగుతుందేమోనని భయపడ్డాను. కానీ ఎవరూ షెఫాలీని అమ్మాయిగా గుర్తుపట్టలేదు. షెఫాలీ హెల్మెంట్‌కు ఎన్నో సార్లు బంతి బలంగా తగిలింది. అయినా తను క్రికెట్‌ను వదల్లేదు' అని సంజీవ్‌ పేర్కొన్నాడు.

మేం ఇద్దరం సచిన్‌ ఫ్యాన్స్‌.:

మేం ఇద్దరం సచిన్‌ ఫ్యాన్స్‌.:

'కొన్నాళ్ల తర్వాత నేషనల్స్‌కు సిద్ధం చేయాలంటే క్రికెట్‌ అకాడమీలో చేర్చాలని భావించా. అమ్మాయి అయిన కారణంగా తనను ఎవరూ చేర్చుకోలేదు. అయినా శిక్షణ ఇచ్చే అకాడమీ అడ్రస్‌ కనుక్కున్నా. అది మా ఇంటికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండేది. దీంతో రోజూ తనను సైకిల్‌పై తీసుకువెళ్లి ప్రాక్టీసు చేయించేవాడిని. మేం ఇద్దరం సచిన్‌ ఫ్యాన్స్‌. షఫాలీని స్పూర్తిగా తీసుకుని కుమారుడు సాహిల్‌, కుమార్తె నాన్సీ కూడా క్రికెట్‌పై దృష్టి సారిస్తున్నారు' అని సంజీవ్‌ వర్మ చెప్పుకొచ్చారు.

Story first published: Friday, October 4, 2019, 10:39 [IST]
Other articles published on Oct 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X