For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'Pulwama Shaheeds': సోషల్ మీడియాలో వైరల్ అయిన సెహ్వాగ్ ట్వీట్

Sehwag Wins Praises for Training Kids of Pulwama Shaheeds at His School

హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడిలో సుమారు నలభైకు పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అమర జవాన్లలో కొందరి పిల్లలకు సెహ్వాగ్‌ తన అంతర్జాతీయ స్కూల్‌లో ఉచితంగా చదువు చెప్పిస్తున్నాడు.

ఈ క్రమంలో ఓ పిల్లాడు క్రికెట్‌ శిక్షణ పొందుతున్న ఫోటోలను సెహ్వాగ్ తన ట్విట్టర్‍‌లో పోస్టు చేస్తూ "హీరోల కుమారులు. నా స్కూల్‌లో ఈ చిన్నారులకు సేవలు అందించడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నా. బ్యాట్స్‌మన్ - అర్పిత్ సింగ్ s/o అమర జవాన్ రామ్‌ వకీల్‌ కుమారుడు కాగా, బౌలర్‌ - రాహుల్‌ సోరెంగ్‌ s/o అమర జవాన్ విజయ్‌ సోరెంగ్‌ కుమారుడు). కొన్ని విషయాలు ఆనందాన్ని ఇస్తాయి" అని ట్వీట్ చేశాడు.

సెహ్వాగ్‌ చేసిన ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరులకు ఎంతో కొంత తిరిగి ఇవ్వడం మన విధి మీరు గొప్ప వారు సర్‌" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... మరొక నెటిజన్ "సర్, మీరు గొప్ప వ్యక్తి, మంచి పని చేస్తున్నారు, అందుకే మీకు సెల్యూట్ చేస్తున్నా" అని ట్వీట్ చేశాడు.

Story first published: Thursday, October 17, 2019, 19:44 [IST]
Other articles published on Oct 17, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+