న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతా చాహాల్ వల్లే: ప్రదర్శన సంతృప్తికరంగా ఉందన్న కుల్దీప్

By Nageshwara Rao
Kuldeep Yadav Says He Is Satisfied With His Performance
Satisfied with my performance today - Kuldeep Yadav

హైదరాబాద్: "ఇది నా మొదటి యూకే పర్యటన. ఈరోజు ప్రదర్శన సంతృప్తికరంగా ఉంది" ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 అనంతరం టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెప్పిన మాటలివి. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 76 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Satisfied with my performance today - Kuldeep Yadav

భారత విజయంలో కుల్దీప్ యాదవ్ కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు. ఒక ఓవర్ మెయిడిన్‌గా వేశాడు. దీంతో మెరుగైన ప్రదర్శన చేసినందుకుగాను కుల్దీప్‌ యాదవ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఇది నా మొదటి యూకే పర్యటన

ఇది నా మొదటి యూకే పర్యటన

ఈ సందర్భంగా కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ "ఇది నా మొదటి యూకే పర్యటన. మంచి ఆరంభం దక్కింది. ఈరోజు ప్రదర్శన సంతృప్తికరంగా ఉంది. భిన్న శైలిలో సరైన ప్రదేశాల్లో బంతులేయడానికి ప్రయత్నించాను. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నేను, చాహల్‌ బౌలింగ్‌ ఎలా వేయాలన్న దాని గురించి చాలా చర్చించుకున్నాం" అని అన్నాడు.

చాహల్‌ నా కంటే ముందు బౌలింగ్‌ చేశాడు

చాహల్‌ నా కంటే ముందు బౌలింగ్‌ చేశాడు

"ఈ మ్యాచ్‌లో చాహల్‌ నా కంటే ముందు బౌలింగ్‌ చేశాడు. ఆ తర్వాత నా వద్దకు వచ్చి పిచ్‌ కొంచెం నెమ్మదిగా ఉంది" అని చెప్పాడు. అందుకు తగ్గట్టుగా బౌలింగ్‌ చేశా. భిన్న శైలిలో బంతులేస్తే మా బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఇంగ్లాండ్‌కు కూడా కష్టతరంగా ఉంటుంది" అని కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు.

76 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

76 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఓపెనర్లు రోహిత్ శర్మ (9), శిఖర్ ధావన్ (74) దూకుడుగా ఆడటంతో 5 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్.. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ను 132/9కే ఆలౌట్ చేసింది.

 స్ఫిన్నర్ల ధాటికి ఏ దశలోనూ కోలుకోలేకపోయిన ఐర్లాండ్

స్ఫిన్నర్ల ధాటికి ఏ దశలోనూ కోలుకోలేకపోయిన ఐర్లాండ్

భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/21), చాహల్ (3/38) ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఓపెనర్ జేమ్స్ (60) కాసేపు క్రీజులో నిలిచి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా, కుల్దీప్ అతడిని పెవిలియన్‌కు చేర్చడంతో ఐర్లాండ్ ఓటమిపాలైంది. రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం రాత్రి 8.30 గంటలకి జరగనుంది.

Story first published: Thursday, June 28, 2018, 17:57 [IST]
Other articles published on Jun 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X