న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ ఒక్కడు కాదు.. పదకొండు మందితో సమానం: పాక్ దిగ్గజం

Saqlain Mushtaq would always advice England spinners to treat Virat Kohli as entire team

కరాచీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఒక్కడు కాదని, అతను జట్టులోని పదకొండు మందితో సమానమని ఇంగ్లండ్ స్పిన్నర్లు మొయిన్‌ అలీ, ఆదిల్ రషీద్‌లకు చెప్పేవాడినని పాకిస్థాన్‌ స్పిన్ దిగ్గజం సక్లెయిన్‌ ముస్తాక్‌ తెలిపాడు. గతేడాది జరిగిన 2019 ప్రపంచకప్‌ వరకూ ఇంగ్లండ్ జట్టుకు స్పిన్‌ సలహాదారుగా సక్లెయిన్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. కోహ్లీ ప్రస్తుతం మూడు ఫార్మాట్‌లలో పరుగుల వరద పారిస్తూ.. ప్రపంచ క్రికెట్లో టాప్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 కోహ్లీ ఒక్కడు కాదు:

కోహ్లీ ఒక్కడు కాదు:

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో సక్లెయిన్‌ ముస్తాక్‌ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ ఒక్కడు కాదు, పదకొండు మందితో సమానం. కోహ్లీ వికెట్‌ దక్కించుకోవాలంటే జట్టు మొత్తానికి బౌలింగ్‌ చేసినట్లే. అతణ్ని అలాగే చూడాలి. ఓ బౌలర్‌గా స్పష్టమైన మానసిక దృక్పథం కలిగి ఉండాలి. నీ ఎదురుగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆటగాడు ఉండొచ్చు. ఏ స్పిన్నర్‌నైనా అతను అలవోకగా ఎదుర్కోవచ్చు. అలాంటి సమయంలో ఒత్తిడి అనేది బౌలర్‌ మీద ఉండదు అని నేను వాళ్లకు (అలీ, రషీద్‌) చెప్పా. ఎందుకంటే.. ప్రపంచం మొత్తం బ్యాట్స్‌మన్‌నే చూస్తుంది' అని తెలిపాడు.

విరాట్‌ వాలా డెలివరీ:

విరాట్‌ వాలా డెలివరీ:

ఓ వన్డేలో లెగ్‌స్పిన్నర్‌ రషీద్‌ లెగ్‌సైడ్‌ వేసిన బంతి వేగంగా తిరిగి.. కోహ్లీ ఆఫ్‌స్టంప్‌ను ఎగరగొట్టింది. ఆ బంతికి 'విరాట్‌ వాలా డెలివరీ' అని పేరు పెట్టాడు ముస్తాక్‌. రషీద్‌ ఆ బంతిని సాధన చేసేలా ప్రోత్సహించాడు. 'వికెట్‌కు దూరంగా పడ్డ బంతి వేగంగా తిరిగి స్టంప్స్‌ను తాకింది. దాంతో విరాట్‌ వాలా డెలివరీ వేయాలని రషీద్‌కు చెప్పా. నెట్స్‌లో దాని కోసం శ్రమించాడు. నీ ప్రాణం మొత్తం బంతి మీదే పెట్టాలి. అతను ప్రపంచంలో నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ కావొచ్చు. కానీ నీ ప్రణాళిక, అంకితభావం.. నీ ప్రాణం బంతిపై పెడితే నువ్వు ఏ మాత్రం తక్కువ కాదు. ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీయాలి. కోహ్లీని ఔట్‌ చేయడం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకునే వాళ్లం' అని ముస్తాక్‌ చెప్పాడు.

దూస్రాను కనిపెట్టిందే ముస్తాక్:

దూస్రాను కనిపెట్టిందే ముస్తాక్:

దూస్రాను కనిపెట్టిందే ముస్తాక్‌ అని, అతను నిజమైన మ్యాచ్‌ విన్నర్‌ అని టీమిండియా వెటరన్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ ఇటీవల పేర్కొన్నాడు. 'ముస్తాక్‌ ఒక గ్రేట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌. అతని నుంచి వచ్చే దూస్రాను ఎవరూ ఆడాలనే అనుకోరు. అతనొక నిజమైన మ్యాచ్‌ విన్నర్‌. దూస్రాను కనిపెట్టిందే ముస్తాక్‌' అని అన్నాడు. అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరు పొందిన సక్లయిన్‌.. పాక్‌ తరపున 49 టెస్టులు, 169 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు.

2008లో అంతర్జాతీయ అరంగేట్రం:

2008లో అంతర్జాతీయ అరంగేట్రం:

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.

సచిన్ సలహా ఇచ్చాడు.. ఆ తర్వాత ఏడాదికే భారత జట్టులో ఉన్నా: భజ్జీ

Story first published: Saturday, June 13, 2020, 8:54 [IST]
Other articles published on Jun 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X