Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ సలహా ఇచ్చాడు.. ఆ తర్వాత ఏడాదికే భారత జట్టులో ఉన్నా: భజ్జీ

Harbhajan Singh Recalls First Time Sachin Tendulkar, Mohd Azharuddin Spotted Him In Nets

ముంబై: తన కెరీర్ తొలినాళ్లలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనకు ఇచ్చిన సలహా ఎంతో ఉపయోగపడిందని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్​ హర్భజన్ సింగ్ చెప్పాడు. తనని భారత జట్టులో తీసుకోవడానికి ప్రధాన కారణం దూస్రా బౌలింగ్‌ విధానమేనని అని భజ్జీ చెప్పుకొచ్చాడు. తనను తొలిసారి గుర్తించింది మోహాలీలో అని, ఓ టెస్టు మ్యాచ్‌ సందర్భంగా భారత బ్యాట్స్‌మన్‌ నెట్స్‌లో సాధన చేస్తుండగా తనను బౌలింగ్‌ చేయమని అడిగారన్నాడు.

 మోయిన్ ‌ఖాన్‌ వల్లే:

మోయిన్ ‌ఖాన్‌ వల్లే:

తాజాగా కామెంటేటర్ ఆకాశ్ చోప్రాతో ఓ యూట్యూబ్ చానెల్ వేదికగా భజ్జీ మాట్లాడాడు. 'నేను త్వరగా టీమిండియాకు ఎంపికవ్వడానికి కారణం దూస్రా బౌలింగ్‌. అప్పట్లో ఈ విధంగా బంతులేసే వాళ్లు చాలా అరుదు. అందరి కన్నా నేను కాస్త మంచి బంతులేసేవాడిని. ఆ విధానాన్ని నేను లెగ్‌కట్టర్‌గా పిలిచేవాణ్ని. అయితే మోయిన్ ‌ఖాన్‌ వల్లే దానికి దూస్రా అనే పేరు వచ్చింది. సక్లెయిన్‌ ముస్తక్‌ బౌలింగ్‌ చేసేటప్పుడు దూస్రా వెయ్యమని మోయిన్ చెప్పేవాడు. దాంతో అది ఫేమస్‌ అయింది. అదే నన్ను భారత జట్టుకు ఎంపికయ్యేలా చేసింది' అని హర్భజన్ పేర్కొన్నాడు.

 ఆ సమయంలో భయపడ్డా:

ఆ సమయంలో భయపడ్డా:

భారత బ్యాట్స్‌మన్‌ నెట్స్‌లో సాధన చేస్తుండగా తనను బౌలింగ్‌ చేయమని అడగ్గా.. తాను భయపడినట్లు భజ్జీ చెప్పుకొచ్చాడు. 'నా బౌలింగ్‌ను చూస్తామని రమ్మంటే భయపడ్డా. నేను వెళ్లేసరికే అందరూ ప్రాక్టీస్‌ ముగించారు. చివరగా దెబాసిష్‌ మొహంతి బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అప్పటికే మొహమ్మద్ అజహరుద్దీన్‌, సచిన్‌ తమ సాధన పూర్తిచేసుకున్నారు. నేను బౌలింగ్‌ చేస్తుండగా.. అజ్జూ భాయ్‌ భోజనం చేస్తున్నాడు. సచిన్‌ మాత్రం నా పక్కనే నిలుచున్నాడు. మొహంతీకి 7-8 బంతులు వేయగా.. అందులో 4-5సార్లు ఔటయ్యాడు' అని హర్భజన్ చెప్పాడు.

 సచిన్‌ నాతో మాట్లాడుతూ:

సచిన్‌ నాతో మాట్లాడుతూ:

'అజయ్‌ జడేజా నన్ను చూసి అజ్జూ భాయ్‌ ఈ కుర్రాడ్ని చూడు అని అరిచాడు. దాంతో అజహరుద్దీన్‌ నన్ను చూశాడు. తర్వాత సచిన్‌ నాతో మాట్లాడుతూ.. ఆట మీద మరింత దృష్టిసారించమని చెప్పాడు. నాకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పి, త్వరలోనే భారత జట్టుకు ఆడాలనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆ సెషన్ తర్వాత ఆటపై మరింత ఏకాగ్రత పెట్టా. ఆ తర్వాత కొన్ని రోజులకే టీమిండియా​ తరఫున అరంగేట్రం చేశా' అని హర్భజన్‌ వివరించాడు.

కెరీర్‌ మలుపు తిరిగింది అప్పుడే:

కెరీర్‌ మలుపు తిరిగింది అప్పుడే:

హర్భజన్‌ సింగ్ 1998లో బెంగుళూరులో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేయగా, అతడి కెరీర్‌ మలుపు తిరిగింది మాత్రం 2001లో. అదే ఆసీస్‌ జట్టుతో చారిత్రక టెస్టు సిరీస్‌లో భజ్జీ 32 వికెట్లు తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అదే సిరీస్‌లో ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టి.. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో మొత్తం 103 మ్యాచ్‌లు ఆడిన హర్భజన్‌ 417 వికెట్లు తీయగా 236 వన్డేల్లో 269 వికెట్లు పడగొట్టాడు.

'బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం చెలాయించేలా ఉండకూడదు.. పోటీ న్యాయంగా ఉండాలి'

Story first published: Saturday, June 13, 2020, 7:58 [IST]
Other articles published on Jun 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+