న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sanju Samson రూ.14 కోట్ల భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ రిటైన్! అవసరమా? అంటున్న ఫ్యాన్స్!

Sanju Samson Doesnt Worth 14 Cr Retention For IPL 2022 Mega Auction Feels RR Fans

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌ మేగా వేలానికి సమయం దగ్గరపడుతుండటంతో ఆయా ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను సిద్దం చేసుకుంటున్నాయి. లీగ్‌లోకి కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడంతో మెగా వేలం నిర్వహించడం అనివార్యమైంది. ఇప్పటికే కొత్త జట్ల కార్యచరణను పూర్తి చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. మేగా వేలం నిర్వహణపై దృష్టి సారించింది. ఇప్పటికే రిటెన్షన్ పాలసీని సిద్దం చేసిన బీసీసీఐ.. నవంబర్ 30లోపు జాబితాలను సమర్పించాలని డెడ్‌లైన్ విధించింది. దాంతో ఫ్రాంచైజీలన్నీ తమ రిటెన్షన్ జాబితాను సమర్పించేందుకు సిద్దమవుతున్నాయి.

 రూ.14 కోట్లకు శాంసన్..

రూ.14 కోట్లకు శాంసన్..

ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్‌ను రిటైన్ చేసుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. రూ.14 కోట్లకు శాంసన్ కెప్టెన్‌గా కొనసాగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీమ్ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 2018 ఐపీఎల్ వేలంలో రూ.8 కోట్లకు శాంసన్‌ను తీసుకున్న రాజస్థాన్ రాయల్స్.. 2021 సీజన్‌లో స్టీవ్ స్మిత్‌ను వేలంలోకి వదిలేయడంతో అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ సీజన్‌లో శాంసన్ అద్భుతంగా రాణించాడు. జట్టును ప్లే ఆఫ్స్ చేర్చడంలో విఫలమైనప్పటికీ వ్యక్తిగతంగా దుమ్మురేపాడు. 14 మ్యాచ్‌ల్లో 484 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే సంజూ శాంసన్‌ను మళ్లీ రిటైన్ చేసుకోవాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

స్టోక్స్, ఆర్చర్ సైతం..

స్టోక్స్, ఆర్చర్ సైతం..

అంతేకాకుండా ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, భారత యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్,లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్‌ల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిబంధనల ప్రకారం విదేశీ ఆటగాళ్లలో ఇద్దరినే తీసుకునే అవకాశం ఉండటంతో బెన్ స్టోక్స్, లివింగ్ స్టోన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌లో ఆల్‌రౌండర్ల పాత్ర కీలకం కాబట్టి స్టోక్స్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్‌ను ఏ ఫ్రాంచైజీ వదులుకోదు. అయితే స్టోక్స్ వచ్చే సీజన్ ఆడుతాడా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. మానసిక సమస్యలతో టీ20 ప్రపంచకప్‌కు దూరమైన స్టోక్స్.. యాషెస్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. జోఫ్రా ఆర్చర్ గాయాలతో సతమతమవుతున్నాడు. అతనికి బదులు జోస్ బట్లర్‌ను తీసుకోవడం ఉత్తమమని ఫ్రాంచైజీ భావిస్తోంది.

 శాంసన్‌కు అవసరమా?

శాంసన్‌కు అవసరమా?

అయితే సంజూ శాంసన్‌కు రూ.14 కోట్లు చెల్లించడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అతని స్థాయికి అంత డబ్బు అవసరం లేదంటున్నారు. ఒకటి, రెండు ఇన్నింగ్స్‌లు మినహా పెద్దగా రాణించలేని సంజూను తీసుకునే బదులు మరో భారత ఆటగాడిని ఎంచుకోవడం ఉత్తమమని నెటిజన్లు సూచిస్తున్నారు. అయితే కొత్తగా రెండు జట్లు వస్తుండటంతో భారత స్టార్ ఆటగాళ్లకు డిమాండ్ ఎక్కువైంది. ఈ క్రమంలో సంజూను అంటిపెట్టుకోవడం మంచి నిర్ణయమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

రిటెన్షన్ రూల్స్ ఇవే..

రిటెన్షన్ రూల్స్ ఇవే..

బీసీసీఐ రూపొందించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. జీత భత్యాల్లో కూడా రూల్స్ పాటించాలి. నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌‌కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు రూ.6 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఫ్రాంచైజీలు రూ.90 కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలతో ఫ్రాంచైజీల కోర్ టీమ్ చెల్లాచెదురు కానుంది.

Story first published: Friday, November 26, 2021, 15:18 [IST]
Other articles published on Nov 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X