న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'వాళ్లు కూడా ఆడేలా కృషి చేస్తున్నాం'

Sanjay Bangar Wants Indian Lower-Order To Show Bit More Application

అడిలైడ్‌: ఆసీస్ గడ్డపై ఆతిథ్య జట్టుపై విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోన్న టీమిండియా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌‌పై దృష్టి సారించనుంది. ప్రతి మ్యాచ్‌లో వారు పరుగులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ టీమిండియా సహాయక కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అన్నాడు. ఆటగాళ్లు సౌకర్యమనే గీతను దాటాల్సిన సమయం వచ్చేసిందని తెలిపాడు. ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్, ఇషాంత్‌లు కాసేపటి వరకూ నిలబడినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్‌ పంత్‌ ఔటైన వెంటనే లోయర్‌ ఆర్డర్‌ కుప్పకూలింది.

5 వికెట్లైతే 25 పరుగుల వ్యవధిలోనే

5 వికెట్లైతే 25 పరుగుల వ్యవధిలోనే

ఇలా టీమిండియా చివరి 7 వికెట్లను 73 పరుగుల వ్యవధిలోనే చేజార్చుకుంది. చివరి ఐదు వికెట్లైతే 25 పరుగుల వ్యవధిలోనే పడిపోవడం గమనార్హం. దీంతో లోయర్ ఆర్డర్ ఆటగాళ్లలోనూ మెరుగైన ప్రదర్శన ఆశిస్తున్నట్లు టీమిండియా సహాయకోచ్ వ్యాఖ్యానించాడు.

9, 10, 11 స్థానాల్లో ఆటగాళ్లు వెంటవెంటనే

9, 10, 11 స్థానాల్లో ఆటగాళ్లు వెంటవెంటనే

మ్యాచ్ కీలక దశలో ఉన్నందున రెండో ఇన్నింగ్స్‌లో లోయర్‌ ఆర్డర్‌ నుంచి కనీసం 25 పరుగులు వస్తాయని ఆశించాం. ఈ దశలోనే బ్యాటింగ్ మెరుగుపరిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. 9, 10, 11 స్థానాల్లోని ఆటగాళ్లు వెంటవెంటనే వికెట్లు చేజార్చుకోకుండా మరింత బాగా ఆడాల్సి ఉంది. రిషభ్‌ పంత్‌ క్రీజులోకి 260 స్కోరు ఉన్నప్పుడు వచ్చి వేగంగా 30-35 పరుగులు జతచేశాడు. దాంతో వెంటనే మరింత మెరుగైన పరిస్థితిలో ఉండాలని లెక్కలు వేశాం.

ధైర్యవంతులే అలాంటి షాట్లు

ధైర్యవంతులే అలాంటి షాట్లు

రిషభ్ నిర్భయంగా ఆడే విధానాన్ని మార్చాలనుకోవడం లేదు. చాలా నాణ్యమైన షాట్లు ఆడాడు. ధైర్యవంతులే అలాంటి షాట్లు ఆడతారు. కష్టాల్లో ఉన్నప్పుడు, పటిష్ఠంగా ఉన్నప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఆడాలో పంత్‌కు తెలుసు. కావాల్సినంత పరిణతి ఉంది. పుజారా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. రహానె తనంతట తానే నైట్‌వాచ్‌మన్‌గా వచ్చాడు. వీరిద్దరూ నాణ్యమైన టెస్టు ఆటగాళ్లు. పుజారా తన అడ్డంకులను అధిగమించి సెంచరీ చేశాడు.

టాపార్డర్‌ నిలకడగా పరుగులు చేయాల్సి

టాపార్డర్‌ నిలకడగా పరుగులు చేయాల్సి

రహానె దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లోనూ పరుగులు చేశాడు. కాకపోతే సెంచరీలుగా మార్చలేకపోయాడు. తొలి సెషన్‌లో ఆడటం ఆందోళనకరంగా ఉంటుంది. కొందరు జోరు అందుకునేందుకు ప్రయత్నిస్తుంటారు, కొందరేమో ఫామ్‌లో ఉండరు. అందుకే ఆత్రుతగా ఉంటుంది. కొత్త బంతితో ఆస్ట్రేలియా నాణ్యమైన బౌలింగ్‌ దాడిని ఎదుర్కొంటూ టాపార్డర్‌ నిలకడగా పరుగులు చేయాల్సి ఉంది.

1
43623
Story first published: Monday, December 10, 2018, 9:16 [IST]
Other articles published on Dec 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X