న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Salman Butt: భారత జట్టులో వాళ్లు ఓవర్‌వెయిట్ ఉన్నారు.. ఫిట్‌నెస్ సరిగ్గా చేసుకుంటే వాళ్లు చాలా డేంజర్

Salman Butt Felt that Some Indian players are overweight, They Need to Overcome from it

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ భారత క్రికెట్ జట్టులోని కొందరు ప్లేయర్లపై విరుచుకుపడ్డాడు. జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఓవర్ వెయిట్ ఉన్నారని, వాళ్ల ఫిట్‌నెస్ ప్రమాణాలు సరిగా ఉన్నాయో లేవో కాస్త సందేహాలున్నాయని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో పోల్చితే సదరు ఆటగాళ్ల ఫిట్ నెస్ ప్రమాణాలు తక్కువగా ఉన్నాయని సల్మాన్ భట్ అన్నాడు. 'భారత ప్లేయర్లు ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందే క్రికెటర్లు. వారు అత్యధిక మ్యాచ్‌లు ఆడతారు. వారిలో కొందరు ఎందుకో ఫిట్‌గా కన్పించడం లేదు.

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తదితర జట్లకు చెందిన ప్లేయర్లను పరిశీలిస్తే.. సదరు భారత ప్లేయర్ల కంటే చాలా మెరుగైన ఫిట్ నెస్ ప్రమాణాలు కలిగి ఉన్నారు. కొన్ని ఆసియా జట్లు కూడా ఈ విషయంలో మెరుగ్గా ఉన్నాయని నేను చెబుతాను. కొంతమంది భారతీయ ఆటగాళ్లు అధిక బరువుతో ఉన్నారు. వారు మంచి క్రికెటర్లే. కాబట్టి వాళ్లు ఫిట్ నెస్ పెంచుకునేందుకు కష్టపడాలని నేను భావిస్తున్నాను' అని భట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లను లక్ష్యంగా చేసుకుని సల్మాన్ భట్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వాళ్లు కాస్త నీరసంగా కనిపించారన్నాడు. అయితే జట్టులోని కోహ్లీ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా లాంటి దిగ్గజాలు జట్టులో అధిక ఫిట్‌నెస్ ప్రమాణాలతో కొనసాగుతున్నారని అంగీకరించాడు. మిగతావాళ్లు ఈ విషయం గురించి మాట్లాడతారో లేదో తెలియదు.

. కానీ నా దృష్టిలో టీమిండియా ఫిట్‌నెస్ సరిగ్గా లేదు. కొంతమంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఫీల్డింగ్ పరంగా ఉండాల్సిన స్థాయిలో ఫిట్‌నెస్‌లో లేరు. జట్టులో కోహ్లీ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా చాలా ఫిట్‌గా ఉన్నారు. కానీ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రోహిత్ మాత్రం అంత ఫిట్‌గా కన్పించలేదు. ఒకవేళ వీరు కూడా ఫిట్ నెస్ మెరుగుపర్చుకుంటే మరింత ప్రమాదకరంగా మారుతారు.' అని సల్మాన్ భట్ అన్నాడు.

Story first published: Wednesday, September 21, 2022, 15:40 [IST]
Other articles published on Sep 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X