న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆకస్మిక నిర్ణయం: ఆసీస్ బౌలింగ్ కోచ్ పదవికి సాకర్ రాజీనామా

Saker resigns as Australia assistant

హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్‌ సాకర్‌ తన పదవికి రాజీనామా చేశాడు. గత మూడు సీజన్ల నుంచి ఆస్ట్రేలియా జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలందించిన డేవిడ్ సాకర్ తన రాజీనామాకు ఇదే సరైన సమయమని భావించి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

<strong>20 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజున అనిల్ కుంబ్లే PERFECT 🔟 (ఫోటోలు)</strong>20 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజున అనిల్ కుంబ్లే PERFECT 🔟 (ఫోటోలు)

ఈ సందర్భంగా డేవిడ్ సాకర్ మాట్లాడుతూ "నేను ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుకు సేవలందించే క్రమంలో చాలా ఎంజాయ్‌ చేశా. మేటి బౌలర్లు ఉన్న జట్టుతో కలిసి పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది" అని సాకర్‌ తెలిపాడు. డేవిడ్ సాకర్ రాజీనామాపై ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్‌ లాంగర్‌ మాట్లాడాడు.

"తొమ్మిది నెలల నుంచి డేవిడ్‌ సాకర్‌తో కలిసి పని చేస్తున్నా. డేవిడ్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జట్టులో చెరగని ముద్ర వేసిన సాకర్‌కు ధన్యవాదాలు. ఆసీస్‌ పేస్‌ బౌలింగ్‌ను మరింత పటిష్టం చేయడంలో సాకర్‌ పాత్ర వెలకట్టలేదని. ఆసీస్‌ జట్టు సభ్యులతో కలిసి ఎంజాయ్‌ చేస్తూ అతని సుదీర్ఘ పయనం చేశాడు" అని లాంగర్ అన్నాడు.

ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో డేవిడ్‌ సాకర్‌ ఆకస్మిక నిర్ణయం క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)ను డైలమాలో పడేసింది. డేవిడ్ సాకర్ స్థానాన్ని గతంలో ఇంగ్లాండ్ బౌలింగ్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉన్న ట్రాయ్‌ కూలీని భారత్‌, పాకిస్థాన్‌లతో సిరీస్‌లకు ఎంపిక చేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా బౌలింగ్ కోచ్‌గా రెండున్నర ఏళ్ల పాటు డేవిడ్ సాకర్ సేవలందించాడు.

Story first published: Thursday, February 7, 2019, 14:53 [IST]
Other articles published on Feb 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X