న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కార్చిచ్చు బాధితుల కోసం రికీ పాంటింగ్ XI జట్టుకు కోచ్‌గా మారిన సచిన్

Sachin Tendulkar to coach Ponting XI, Courtney Walsh to train Warne XI for bushfire relief match

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితుల‌ కోసం విరాళాలు సేకరించేందుకు గాను ఫిబ్రవరి 8న క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ఛారిటీ మ్యాచ్‌ని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న జరిగే బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఆల్ స్టార్ టి20 మ్యాచ్ కర్టెన్ రైజర్‌గా ఆడనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటన చేసింది.

ఈ మ్యాచ్‌లో పాల్గొనే ఇరు జట్లకు షేన్ వార్న్, రికీ పాంటింగ్‌లు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. రికీ పాంటింగ్ XI జట్టుకు సచిన్ టెండూల్కర్ కోచ్‌గా వ్యవహారిస్తుండగా... షేన్ వార్నర్ XI జట్టుకు కోర్ట్నీ వాల్ష్‌ కోచ్‌గా వ్యవహారించనున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్ రాబర్డ్స్ ధ్రువీకరించారు.

<strong>కివీస్ పర్యటన కోహ్లీసేనకు ఓ సవాల్: షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్, టీవీ టెలికాస్ట్ డిటేల్స్!</strong>కివీస్ పర్యటన కోహ్లీసేనకు ఓ సవాల్: షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్, టీవీ టెలికాస్ట్ డిటేల్స్!

గౌరవం ఉంది

గౌరవం ఉంది

మంగళవారం ఆయన మాట్లాడుతూ సచిన్, కోర్ట్నీలను తిరిగి ఆస్ట్రేలియాకు స్వాగతిస్తున్నందుకు మాకు గౌరవం ఉందన్నారు. ఆసీస్ గడ్డపై వారిద్దరూ ఆటగాళ్ళుగా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించారని... ఒక ప్రత్యేకమైన మ్యాచ్ కోసం వీరిని ఆహ్వానించడం... అందులో వారు పాల్గొనడాన్ని మేము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నామని తెలిపాడు.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో

కాగా, వీరిద్దరూ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా... కోర్ట్నీ వాల్స్ టెస్టుల్లో 500 వికెట్లు పడగొట్టాడు. మా ప్రజల కోసం క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు మొత్తం ఆస్ట్రేలియన్ క్రికెట్ కుటుంబం చేసిన ఈ బిగ్ అప్పీల్ కోసం అందరం కలిసి వస్తారని ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

నాన్ ప్లేయింగ్ కెప్టెన్సీలో స్టీవ్ వా

నాన్ ప్లేయింగ్ కెప్టెన్సీలో స్టీవ్ వా

బ్రెట్ లీ, జస్టిన్ లాంగర్, మైకేల్ క్లార్క్, ఆడమ్ గిల్ క్రిస్ట్, షేన్ వాట్సన్, అలెక్స్ బ్లాక్‌వెల్ లాంటి మాజీ దిగ్గజాలు ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా... ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రీడాకారిణి మెల్ జోన్స్ కూడా నాన్ ప్లేయింగ్ కెప్టెన్సీలో పాల్గొంటారు.

అదే రోజు ఓవల్ స్టేడియంలో

అదే రోజు ఓవల్ స్టేడియంలో

అదే రోజు మెల్‌బోర్న్ వేదికగా జంక్షన్ ఓవల్ స్టేడియంలో భారత-ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య అంతర్జాతీయ టీ20 జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌ల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ రికవరీ ఫండ్‌కు అందజేయనున్నారు.

Story first published: Tuesday, January 21, 2020, 12:56 [IST]
Other articles published on Jan 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X