న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంటికి వెళ్లిపో.. ఇక నీ కెరీర్ ముగిసిపోయింది.. గంగూలీకి సచిన్ సీరియస్ వార్నింగ్!!

Sachin Tendulkar threatened to end Sourav Gangulys career following loss to West Indies in 1997

ముంబై: క్రికెట్ బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ క్రికెటర్‌గా కొనసాగిన సమయంలో మైదానం వెలుపల ఎంత సరదాగా ఉన్నా.. బరిలోకి దిగాక మాత్రం ఆటపై ఎంతో ఏకాగ్రత చూపించేవాడు. ఇక ‌క్రికెట్‌ ఆడిన రోజుల్లో ఎప్పుడైనా సచిన్‌లో కోపం చూసిన క్షణాలు చాలా అరుదు. ఎటువంటి వివాదాలు, హెచ్చరికలు లేకుండానే సచిన్‌ తన క్రీడా జీవితాన్ని ముగించాడు. అయితే కెరీర్ ఆరంభంలోనే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సచిన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట. ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్త తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

<strong>బాబర్ అజామ్ బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపముంది: పాక్ మాజీ క్రికెటర్</strong>బాబర్ అజామ్ బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపముంది: పాక్ మాజీ క్రికెటర్

1997లో వెస్టిండీస్ పర్యటన:

1997లో వెస్టిండీస్ పర్యటన:

సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని టీమిండియా 1997లో వెస్టిండీస్ పర్యటనకి వెళ్లింది. ఆ సిరీస్‌లో భాగంగా బార్బడోస్‌లో జరిగిన మూడో టెస్టుల్లో సచిన్ (92), రాహుల్ ద్రవిడ్ (78) మినహా అందరూ ఫెయిలయ్యారు. ఇక 81 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్‌ అయింది . సౌరవ్ గంగూలీ తొలి ఇన్నింగ్స్‌లో 22, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు చేసాడు. భారత్ జట్టు 38 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. కెప్టెన్ సచిన్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ.. డ్రెస్సింగ్ రూములో ఆటగాళ్లకి క్లాస్ తీసుకున్నట్లు విక్రాంత్ తెలిపాడు. కానీ ఆ క్లాస్ అనంతరం సచిన్‌ని ఓదార్చేందుకు గంగూలీ వెళ్లి వార్నింగ్‌ని ఎదుర్కొన్నాడని చెప్పాడు.

ఆటగాళ్లందరికీ సచిన్ క్లాస్:

ఆటగాళ్లందరికీ సచిన్ క్లాస్:

'డ్రెసింగ్‌ రూంలో ఆటగాళ్లందరికీ సచిన్ క్లాస్ తీసుకున్నాడు. ఆ సమయంలో కెప్టెన్సీ సామర్థ్యంపై సందేహాలని కూడా లిటిల్ మాస్టర్ వ్యక్తపరిచాడు. అప్పుడప్పుడే జట్టులోకి వచ్చిన గంగూలీ.. కెప్టెన్ సచిన్‌ని ఓదార్చేందుకు అతని రూంకు వెళ్లాడు. అయితే గంగూలీతో పెద్దగా మాట్లాడని సచిన్.. రేపు పొద్దునే మార్నింగ్‌ రన్‌కి రెడీగా ఉండమన్నాడు. అయితే గంగూలీ మరుసటి రోజు ఆ రన్‌కి వెళ్లలేదు. దాంతో కోప్పడిన సచిన్‌కు కోపమొచ్చింది.‌ "సర్దుకుని ఇంటికి వెళ్లిపో. ఇక్కడితో నీ కెరీర్ ముగిసింది" అని గంగూలీకి వార్నింగ్ ఇచ్చాడు' అని విక్రాంత్ తెలిపాడు.

ఆలౌట్‌ అయ్యాం:

ఆలౌట్‌ అయ్యాం:

భారత జట్టుకు సచిన్‌ టెండూల్కర్‌ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోప్పడటమే కాకుండా తనకు వార్నింగ్‌ కూడా ఇచ్చాడని తాజాగా సౌరవ్ గంగూలీ కూడా గుర్తు చేసుకున్నాడు. 'ఐదు టెస్టుల సిరీస్‌ను అప్పుడు భారత జట్టు 0-1తో ఓడిపోయింది. వాస్తవానికి మూడో టెస్టులో విండీస్‌కు దక్కిన ఆ విజయం భారత్‌ ఖాతాలో పడాల్సింది. మూడో టెస్టులో విండీస్‌ మాకు 120 పరుగుల టార్గెట్‌ను మాత్రమే నిర్దేశించింది. ఇది చాలా స్పల్ప లక్ష్యం. కానీ మేము 81 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయ్యాం. దాంతో గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిపోయాం. ఫలితంగా సిరీస్‌ను విండీస్‌ గెలుచుకుంది' అని సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నాడు.

సచిన్‌ నాకు వార్నింగ్‌ ఇచ్చాడు:

సచిన్‌ నాకు వార్నింగ్‌ ఇచ్చాడు:

'అప్పటికి భారత జట్టు విండీస్‌ గడ్డపై సిరీస్‌ గెలవక 11 ఏళ్లైంది. దీంతో సువర్ణావకాశం చేజారిందన్న ఆవేదనలో కెప్టెన్‌గా ఉన్న సచిన్‌ తొలిసారిగా డ్రెస్సింగ్‌ రూమ్‌లోపిలిపించాడు. ఆ క్రమంలోనే సచిన్‌ తన కోపాన్ని నాపై చూపాడు. ప్రతీ రోజూ మైదానం చుట్టూ పరుగెత్తితేనే భవిష్యత్తు ఉంటుందని హెచ్చరించాడు. నువ్వు జట్టులో చోటు నిలబెట్టుకోవాలంటే.. రోజూ ఉదయమే పరుగెత్తాల్సిందే అని వార్నింగ్‌ ఇచ్చాడు. కెప్టెన్‌గా అవసరమైనప్పుడు సహచరులను మందలించడంలో తప్పు లేదు' అని దాదా చెప్పాడు.

సచిన్‌ ఆటను గమనిస్తూ పెరిగా:

సచిన్‌ ఆటను గమనిస్తూ పెరిగా:

14 ఏళ్ల వయస్సు నుంచే తాను సచిన్‌ ఆటను గమనిస్తూ పెరిగానని సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. ఆ తర్వాత టీమిండియా తరఫున అరంగేట్రం చేశాక సచిన్‌తో కలిసి ఓపెనర్‌గా ఆడడంతో పాటు తమ జోడీ ఎన్నో విజయాలు అందించిందని దాదా గుర్తు చేశాడు. తదనంతరం 2000లో జట్టు పగ్గాలు చేపట్టిన గంగూలీ అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. భారత క్రికెట్‌ను ఓ ఎత్తుకు తీసుకెళ్లాడు.

Story first published: Monday, June 8, 2020, 14:18 [IST]
Other articles published on Jun 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X