న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL Flashback: ఐపీఎల్‌లో బ్యాటును నేలకేసి కొట్టిన సచిన్.. ఎప్పుడు, ఎందుకో తెలుసా?!!

Sachin Tendulkar slams bat in disgust as Mumbai Indians lose tense final against Chennai Super Kings

హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రమశిక్షణ గురించి అందరికీ తెలిసిందే. మైదానంలో ప్రత్యర్థి బౌలర్ కవ్వించినా.. అస్సలు ఆవేశపడేవాడు కాదు. అతడికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పేవాడు. ప్రత్యర్థి జట్టులోని ఎవరు కవ్వించినా.. నవ్వుతూనే ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నోసార్లు అంపైర్లు ఉత్తిపుణ్యాన ఔట్ ఇచ్చినా.. ఏ రోజు కూడా అసహనం చేయలేదు. అంపైర్ నిర్ణయానికే అతడు కట్టుబడేవాడు. ఇంత ఘనమైన చరిత్ర ఉన్న సచిన్.. ఓసారి ఆవేశంతో బ్యాటును నేలకేసి కొట్టాడు. అదికూడా ఐపీఎల్‌లో. విషయంలోకి వెళితే...

తొలిసారి ఫైనల్‌కు

తొలిసారి ఫైనల్‌కు

అది ఐపీఎల్‌-2010. ముంబై ఇండియన్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ ఏడాది పరుగుల వరద పారించాడు. 15 మ్యాచుల్లో 47.53 సగటు, 132.61 స్ట్రైక్‌రేట్‌, 5 అర్ధ శతకాలతో 618 పరుగులు చేశాడు. దీంతో టాప్ బ్యాట్స్‌మన్‌ హోదాలో 'ఆరెంజ్‌ క్యాప్‌' అందుకున్నాడు. సచిన్ అద్భుతంగా రాణించడంతో ఆ సీజన్‌లో ముంబై తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. సచిన్ ఫామ్ చూస్తే.. ఆ ఏడాది ముంబై కప్ కొట్టేలా కనిపించింది. కానీ ఫైనల్లో బ్యాట్స్‌మన్‌ తడబాటు కారణంగా బోల్తా కొట్టింది.

రైనా హాఫ్ సెంచరీ

రైనా హాఫ్ సెంచరీ

ఫైనల్ మ్యాచులో మొదటగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్ హేడెన్ 31 బంతుల్లో 17 పరుగులే చేసి విఫలమవగా.. మురళీ విజయ్‌ (26; 19 బంతుల్లో 1×4, 2×6) ఫర్వాలేదనిపించాడు. స్టార్ ఆటగాడు సురేశ్‌ రైనా (57*; 35 బంతుల్లో 3×4, 3×6) అర్ధ శతకం సాధించాడు. ఎస్ బద్రినాత్ (14), ఎంఎస్ ధోనీ (22), అల్బీ మోర్కెల్ (15) పరుగులు చేశారు.

నాయర్‌ పరుగుకోసం ప్రయత్నించగా

నాయర్‌ పరుగుకోసం ప్రయత్నించగా

లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఎనమిది బంతులాడిన శిఖర్‌ ధావన్‌ డకౌట్‌ అయ్యాడు. అప్పుడు జట్టు స్కోర్ 1. ఈ సమయంలో సచిన్‌ (48; 45 బంతుల్లో 7×4), అభిషేక్‌ నాయర్‌ (27; 26 బంతుల్లో 1×4, 2×6)తో కలిసి రెండో వికెట్‌ 66 పరుగుల భాగస్వామ్యం అందించారు. దాంతో ముంబై కోలుకుంది. ఇక స్కోరు బోర్డు ఊపందుకుంటోంది అన్న తరుణంలో నాయర్‌ అనూహ్యంగా రనౌట్‌ అయ్యాడు. 11.2వ బంతిని ఆడిన నాయర్‌.. పరుగుకోసం ప్రయత్నించాడు. బంతి క్రీజు వద్దే ఉండటంతో సచిన్‌ ముందుకు కదల్లేదు. ఈలోపే ఎంఎస్ ధోనీ వికెట్లను పడగొట్టాడు.

ఆవేశపడ్డ సచిన్

ఆవేశపడ్డ సచిన్

అభిషేక్‌ నాయర్ ఔట్ అయి పెవిలియన్ చేరుకున్న క్షణంలో ఆవేశపడ్డ సచిన్..‌ బ్యాటును నేలకు కొట్టాడు. అప్పటివరకు సచిన్ అలా చేయడం ఎప్పుడూ చూడలేదు. బహుశా అప్పటి వరకు ముంబైకి ట్రోఫీ రాలేదు కాబట్టి సచిన్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఆవేశపడి ఉండొచ్చు. ఆ తర్వాత హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో సచిన్ ఔటయ్యాడు. ఆపై హర్భజన్ సింగ్ నిరాశపరిచాడు. ఇక అంబటి రాయుడు (21), కీరన్ పోలార్డ్ (27) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 20 ఓవర్లకు 146/9 మాత్రమే చేసి 22 పరుగుల తేడాతో ఓడిపోయింది.

CSK: అయ్యో దేవుడా.. రుత్‌రాజ్‌ గైక్వాడ్‌కు మళ్లీ పాజిటివ్‌.. చెన్నైకి తప్పని కష్టాలు!!

Story first published: Tuesday, September 15, 2020, 16:17 [IST]
Other articles published on Sep 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X