న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చివ‌రి ఓవ‌ర్ బౌలింగ్ చేసి మ్యాచ్‌ను గెలిపించిన సచిన్.. ఎప్పుడంటే?!!

Sachin Tendulkar recalls sensational last over against South Africa in 1993 thriller

ముంబై: క్రికెట్ దిగ్గజాల్లో స‌చిన్ టెండూల్క‌ర్ ఒకరు. భారత జట్టుకు ఎంతో సేవ చేసారు సచిన్. బ్యాట్స్‌మెన్‌గా త‌న పేరుపై ఎన్నో రికార్డులు లిఖించుకున్నారు. టెస్టు, వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా సచిన్ రికార్డుల్లో ఉన్నారు. టెస్టు, వ‌న్డే ఫార్మాట్ల‌లో క‌లిసి వంద సెంచ‌రీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్. అయితే అద్భుత బ్యాట్స్‌మన్‌ మాత్రమే కాకుండా మంచి బౌల‌ర్ కూడా . స‌చిన్ త‌న లెగ్‌బ్రేక్ బౌలింగ్‌తో వ‌‌న్డేల్లో 156 వికెట్లు, టెస్టుల్లో 46 వికెట్లు, టీ20ల్లో ఒక వికెట్ తీశాడు.

<strong>ఐపీఎల్ వేలంలో ఊహించ‌ని ధ‌ర అది: టీమిండియా పేసర్</strong>ఐపీఎల్ వేలంలో ఊహించ‌ని ధ‌ర అది: టీమిండియా పేసర్

1993 హీరో క‌ప్‌

1993 హీరో క‌ప్‌

బ్యాట్స్‌మెన్‌గా కాకుండా ఒక బౌల‌ర్‌గా మ్యాచ్ గెలిపించిన సంద‌ర్భాల్లో ఏది ఇష్టం అని సచిన్‌ను అడిగితే.. 1993 హీరో క‌ప్‌లో భాగంగా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌ను థ్రిల్ల‌ర్ మ్యాచ్‌గా గుర్తుపెట్టుకుంటాన‌ని లిటిల్ మాస్టర్ చాలా సంద‌ర్భాల్లో తెలిపాడు. తాజాగా ఐసీసీ మీ జీవితంలో ఒక మొమ‌ర‌బుల్ మూమెంట్‌ను షేర్ చేసుకోవాల‌ని సచిన్‌ను అడగ్గా.. మ‌రోసారి ఆ థ్రిల్ల‌ర్ మ్యాచ్‌ను గుర్తుచేశాడు. 20 సంవత్సరాల వయస్సులో టెండూల్కర్ చిరస్మరణీయమైన ఓవర్‌ను వేశారు.

చివ‌రి ఓవ‌ర‌లో 6 ప‌రుగులు:

చివ‌రి ఓవ‌ర‌లో 6 ప‌రుగులు:

సచిన్ మాట్లాడుతూ... '1993 హీరో క‌ప్‌లో భాగంగా ఈడెన్‌గార్డెన్‌లో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన సెమీఫైన‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసి 50 ఓవ‌ర్ల‌లో 196 ప‌రుగులు చేశాం. కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ 90 ప‌రుగుల‌తో రాణించ‌డంతో జ‌ట్టు ఆ మాత్రం స్కోరైనా చేసింది. త‌ర్వాత భారత బౌల‌ర్లు పొదుపుగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు తెచ్చారు. ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించాలంటే చివ‌రి ఓవ‌ర‌లో ఆరు ప‌రుగులు చేయాలి. ఇక క్రీజులో బ్రియాన్ మెక్‌మిల‌న్ 48 ప‌రుగుల‌తో ఉన్నాడు' అని తెలిపారు.

అజారుద్దీన్ బంతినిచ్చాడు:

అజారుద్దీన్ బంతినిచ్చాడు:

'కెప్టెన్ అజారుద్దీన్ బంతిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అంత ఉత్కంఠ స‌మ‌యంలో బంతి నాకెందుకు ఇచ్చాడో అర్థం కాలేదు. నా మ‌నుసులో స‌రే అనుకొని బౌలింగ్‌కు దిగాను. అయినా ఎక్కడో కొంచెం బయమేసింది. మొద‌టి బంతిని ఆడిన మెక్‌మిల‌న్ రెండో ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించ‌డంతో.. ఫానీ డివిలియ‌ర్స్ ర‌నౌట్‌ అయ్యాడు. దీంతో విజ‌యలక్ష్యం ఐదు బంతుల్లో 5 ప‌రుగులుగా మారింది. జట్టులో అందరి ముఖాల్లో వెలుగులు నిండాయి' అని లిటిల్ మాస్టర్ చెప్పారు.

 చాలా కాలం పాటు గుర్తుంది:

చాలా కాలం పాటు గుర్తుంది:

'త‌ర్వాతి మూడు బంతుల‌ను డాట్ బాల్స్‌గా వేసాను. ఇక చివ‌రి బంతికి 4 ప‌రుగులు కావాలి. మెక్‌మిలన్ బంతిని బ‌లంగానే బాదిన‌ప్ప‌టికి సింగిల్ మాత్రమే వ‌చ్చింది. మూడు ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికాపై విజ‌యం సాధించ‌డంతో జ‌ట్టులో సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. చివ‌రి బంతి వ‌ర‌కు వచ్చి విజ‌యం సాధించినా.. చివ‌రి ఓవ‌ర్ నేను వేసి జ‌ట్టును గెలిపించానా అన్న‌దే ఎక్కువ సంతోషాన్నిచ్చింది. ఈ థ్రిల్ల‌ర్ మ్యాచ్ నాకు చాలా కాలం పాటు గుర్తుంది' స‌చిన్‌ చెప్పుకొచ్చారు.

Story first published: Wednesday, April 22, 2020, 18:33 [IST]
Other articles published on Apr 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X