న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ ఫ్యాన్స్‌కు పండుగే: మళ్లీ బ్యాట్ పట్టనున్న సచిన్, లారా

Road Safety World Series: Sachin, Lara Teams Up For T20 Tournament In India | Oneindia Telugu
Sachin Tendulkar, Brian Lara to play Road Safety World Series T20 tournament in India

హైదరాబాద్: బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియన్ లారాలు బ్యాట్ పట్టనున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా వచ్చే ఏడాది జరిగే టీ20 టోర్నమెంట్‌లో మాజీ క్రికెటర్లు సందడి చేయనున్నారు. వరల్డ్ సిరిస్ అనేది వార్షిక టీ20 టోర్నమెంట్.

ఈ టోర్నీలో మొత్తం ఐదు దేశాలు(ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, భారత్‌)కు చెందిన మాజీ క్రికెటర్లు మైదానంలో సందడి చేయనున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు వెస్టిండిస్ దిగ్గజం బ్రియానా లారాలతో పాటు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆస్ట్రేలియా బౌలింగ్ గ్రేట్ బ్రెట్‌లీ, శ్రీలంక ఓపెనర్ దిల్షాన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌లు ఈ టోర్నీలో ఆడనున్నారు.

ఎన్నిక లాంఛనమే: గంగూలీ నామినేషన్ ధృవీకరించిన బీసీసీఐ ఎన్నికల అధికారిఎన్నిక లాంఛనమే: గంగూలీ నామినేషన్ ధృవీకరించిన బీసీసీఐ ఎన్నికల అధికారి

వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 16 మధ్యలో జరిగే ఈ టోర్నమెంట్‌లో ఆటగాళ్లందరూ జట్లుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమిస్తోంది. 46 ఏళ్ల సచిన్ టెండూల్కర్ అటు టెస్టుల్లోనూ, ఇటు వన్డేల్లోనూ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుని ప్రపంచ క్రికెట్లో 100 సెంచరీలు సాధించాడు.

2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2008లో సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్రియాన్ లారా(11,953) పరుగులు రికార్డుని బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. కాగా, లారా 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లారా పేరిట రికార్డు ఉంది.

కోహ్లీ చుట్టూ కొంతమంది చెత్త కెప్టెన్లు కూడా ఉన్నారు: అక్తర్ సంచలన వ్యాఖ్యలుకోహ్లీ చుట్టూ కొంతమంది చెత్త కెప్టెన్లు కూడా ఉన్నారు: అక్తర్ సంచలన వ్యాఖ్యలు

2004లో ఆంటిగ్వా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రియాన్ లారా 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఈ రికార్డుని నెలకొల్పాడు. ఈ రికార్డుని ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా బద్దలు కొట్టలేకపోయాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో బ్రియాన్ లారా అనేక రికార్డులను నెలకొల్పాడు.

Story first published: Tuesday, October 15, 2019, 18:56 [IST]
Other articles published on Oct 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X